Share News

MLA : పేదల కోసమే టీడీపీ స్థాపన

ABN , Publish Date - Mar 30 , 2025 | 01:02 AM

పేద ప్రజల సంక్షేమం కోసం ఆనాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఎమ్మెల్యే పరి టాల సునీత పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన రాప్తాడులోని టీడీపీ కార్యాలయంలో శనివారం టీడీపీ 43వ ఆవిర్బావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. టీడీపీ నాయకులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించారు.

MLA : పేదల కోసమే టీడీపీ స్థాపన
MLA and TDP leaders paying tribute to NTR and Paritala Ravindra

- ఎమ్మెల్యే పరిటాల సునీత

రాప్తాడు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజల సంక్షేమం కోసం ఆనాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఎమ్మెల్యే పరి టాల సునీత పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన రాప్తాడులోని టీడీపీ కార్యాలయంలో శనివారం టీడీపీ 43వ ఆవిర్బావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. టీడీపీ నాయకులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాప కులు ఎన్టీఆర్‌, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర చిత్రపటాలకు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ పార్టీ స్థాపించిన తరువాతే బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజకీయాల్లో రాణిస్తున్నా రన్నారు. పరిటాల రవి మరణాంతరం పరిటాల కుటుంబానికి ముఖ్య మంత్రి చంద్రబాబు అండగా ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు, మంత్రి నారా లోకేష్‌ సహకారంతో నియోజకవర్గంలో వేల కోట్లతో అభివృద్ది పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.


ప్రకాష్‌రెడ్డికి ఎమ్మెల్యే పరిటాల సునీత చాలెంజ్‌

పాపంపేట స్థలం విషయంలో పరిటాల కుటుంబ తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకాష్‌రెడ్డికి చాలెంజ్‌ విసి రారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే నియోజకవర్గంలో తిరగనివ్వ మని హెచ్చరించారు. రామగిరి ఎంపీపీ ఎన్నిక విషయంలో ఎనిమిది మంది ఎంపీటీసీలు వైసీపీకి చెందిన వారు ఉన్నప్పటికీ వారిని ఇతర రాష్ట్రాలకు ఎందుకు తరలించావని ప్రకాష్‌రెడ్డిని ప్రశ్నించారు. పోలీసులపై ప్రకాష్‌రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడారని, దీనిపై పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. మండల ఇనచార్జ్‌లు ధర్మవరపు మురళి, బాలాజీ, రాప్తా డు, అనంతపురం రూరల్‌ కన్వీనర్లు పంపు కొండప్ప, జింకా సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, రఘు, మాజీ కన్వీనర్‌ నారాయణస్వామి, సర్పంచులు తిరుపాలు, శీనయ్య, గంగలకుంట రమణ, మరూరు గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 30 , 2025 | 01:02 AM