Share News

TRIBUTE : ఆదర్శన పాలనకు దిక్సూచి జగ్జీవనరామ్‌

ABN , Publish Date - Apr 06 , 2025 | 12:28 AM

సమసమాజ నిర్మాణంకోసం ప్రజలకు ఆదర్శ వంతమైన పాలన అందించడంలో నేటి పాలకులకు మాజీ ఉప ప్రఽధాని డాక్టర్‌ జగ్జీ వన రామ్‌ దిక్సూచిలాంటివారని పలువరు నా యకులు కొనియాడారు. జగ్జీవన రామ్‌ జ యంతిని పురస్కరించుకుని శనివారం వేడు కలను ఘనంగా నిర్వహించారు.

TRIBUTE : ఆదర్శన పాలనకు దిక్సూచి జగ్జీవనరామ్‌
MLA Paritala Sunitha paying tribute to Jagajjivan Ram

జయంతి వేడుకల్లో కొనియాడిన వక్తలు

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌)

సమసమాజ నిర్మాణంకోసం ప్రజలకు ఆదర్శ వంతమైన పాలన అందించడంలో నేటి పాలకులకు మాజీ ఉప ప్రఽధాని డాక్టర్‌ జగ్జీ వన రామ్‌ దిక్సూచిలాంటివారని పలువరు నా యకులు కొనియాడారు. జగ్జీవన రామ్‌ జ యంతిని పురస్కరించుకుని శనివారం వేడు కలను ఘనంగా నిర్వహించారు. సప్తగిరి సర్కి ల్‌ కేఎస్‌ఆర్‌ కళాశాల ఎదురుగా నిర్వహిం చిన వేడుకల్లో జగ్జీవన రామ్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించేందుకు వివిధ పార్టీలు, కుల సంఘాలు, రిజర్వేషన ఉద్యోగ సంఘాల నాయకులతోపాటు ప్రజలు బారులు తీరారు. ఈ సందర్భంగా జగ్జీవన ఆశయాలపై దళిత సంఘాల నాయకులు సాకేహరి పాడినపాట ఆలో చింపజేసింది. అలాగే ఆ యా కారాలయాల్లో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి, నివా ళులర్పించారు. అనంతపురంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే పరి టాల సునీత ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళుర్పిం చారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. జేవీవీ జిల్లా కార్యాలయంలో జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ జగజ్జీవన రామ్‌ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. జేవీవీ రాష్ట్ర నాయకు డు సాకే భాస్కర్‌, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకట్రామిరెడ్డి, లక్ష్మీనారా యణ, డాక్టర్‌ ప్రసూన తదితరులు పాల్గొన్నారు. అలాగే టీడీపీ అర్బన కార్యాలయంలో జగజ్జీవన రామ్‌ జయంతిని నిర్వహించారు. నాయకులు గంగారామ్‌, తలారి ఆదినారాయణ, రాయల్‌ మురళి, స్వామిదాస్‌, కూచి హరి, సుధాకర్‌ యాదవ్‌, బాలాంజినేయులు, కుంచెపు వెంకటేష్‌, పోతుల లక్ష్మీనరసింహులు, పీఎల్‌ఎన మూర్తి, కడియాల కొండన్న, పరమేశ్వరన, సిమెంట్‌ పోలన్న, లక్ష్మీ నరసింహ, గోపాల్‌ గౌడ్‌, ఇస్మాయిల్‌, ఓంకార్‌రెడ్డి, వెంకటప్ప, కృష్ణకుమార్‌, నెట్టెం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జగ్జీవనరామ్‌ విగ్రహానికి వైసీపీ నాయకు లు పూలమాలలు వేసి నివా ళులర్పించారు. నగరమేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్‌ వా సంతి సాహిత్య తదితరులు పాల్గొన్నారు. ఆలిండియా ఎస్సీ ఎస్టీ గెజిటెడ్‌ అధికారుల సంక్షేమసంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్‌ తదితరలు స్థానిక సప్తగిరి సర్కిల్‌లో ఉన్న జగ్జీవనరామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. సంఘం కేంద్రకమిటీ సభ్యులు సోమశేఖర్‌, నాయకులు సుగప్ప, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రజా ప్రతినిఽధి విలువలకు డాక్టర్‌ జగ్జీవనరామ్‌ నిలువుటద్దమని జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్‌ సుదర్శనరావు పేర్కొన్నారు. వర్సిటీ పరిపాలనా భవనంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో జగ్జీవన చిత్రటపానికి వీసీ సుదర్శనరావు నివాళులర్పించి మాట్లా డారు. కార్యరక్రమంలో ఓఎస్డీటు వీసీ దేవన్న, రిజిస్ర్టార్‌ కృష్ణయ్య తదితరు లు పాల్గొన్నారు. జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో జగ్జీవనరామ్‌ జయంతిని నిర్వహించి, నివాళులర్పించారు. కార్యక్రమంలో ఇనచార్జ్‌ డీఎంహెచఓ డాక్టర్‌ నారాయణస్వామి, ఏఓ గిరిజామనోహర్‌, వైద్య ఉద్యోగులు పాల్గొన్నారు. మండలకేంద్రమైన నార్పలలోని దండోరా కార్యాలయంలో, రామగిరి తహసీల్దార్‌ కార్యాలయంలో, నసనకోట బాలికల గురుకుల పాఠశాలలో జగ్జీవనరామ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 06 , 2025 | 12:28 AM