Home » Ravindra Jadeja
రవి చంద్రన్ అశ్విన్ టెస్ట్‌ల్లో 500కు పైగా వికెట్లు తీశాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో అశ్విన్‌ది గొప్ప కాంబినేషన్. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో వీరిద్దరిదీ విజయవంతమైన బౌలింగ్ జోడీగా నిలిచింది.
ఇంగ్లండ్‌తో ముగిసిన మూడో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొట్టిన రోహిత్ సేన 434 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించింది. 557 పరుగుల భారీ లక్ష్య చేధనలో టీమిండియా బౌలర్లను ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగులకే కుప్పకూల్చింది.
ఇంగ్లండ్‌తో మొదలైన మూడో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సర్ఫరాజ్ ఖాన్ రనౌట్‌కు రవీంద్ర జడేజానే కారణమంటూ పలువురు మండిపడుతున్నారు.
ఇంగ్లండ్‌తో మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా చెలరేగారు. సెంచరీలతో దుమ్ములేపిన వీరిద్దరు నాలుగో వికెట్‌కు 204 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును వీరిద్దరు ఆదుకున్నారు.
ఇంగ్లండ్‌తో మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి గురయ్యాడు. డగౌట్లో తీవ్ర కోపంతో ఊగిపోయాడు. కోపాన్ని ఆపుకోలేక తలపై ఉన్న క్యాప్‌ను తీసి నేలకేసి కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కెప్టెన్ రోహిత్ శర్మ(131), లోకల్ బాయ్ రవీంద్ర జడేజా(110*) సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లండ్‌తో మొదలైన మూడో టెస్టులో తొలి రోజు ఆటలో టీమిండియా అధిపత్యం కొనసాగింది. రోహిత్, జడేజా సెంచరీలకు తోడు అరంగేట్ర బ్యాటర్ సర్ఫారాజ్ ఖాన్ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కుటుంబ విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జడేజాకు రివాబాతో వివాహం అయినప్పటి నుంచి తమ కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయని చెప్పుకొచ్చాడు.
తన తండ్రి చేసిన ఆరోపణలపై తాజాగా రవీంద్ర జడేజా స్పందించాడు. ఆ ఆరోపణలన్నీ అబద్ధాలని, అది పూర్తిగా ఓ స్క్రిప్ట్ ప్రకారం జరిగిన ఇంటర్వ్యూ అని కౌంటర్ ఇచ్చాడు.
హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓడిన టీమిండియా రెండో మ్యాచ్ కోసం సిద్దమవుతుంది. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్ వేదికగా జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ సేన గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం చవిచూసిన భారత జట్టుకి తాజాగా రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. వైజాగ్‌లో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. వాళ్లే.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా & కేఎల్ రాహుల్.