Cricket: ఒకేరోజు 12 మంది క్రికెటర్ల బర్త్‌డే.. బుమ్రా, జడ్డూ సహా లిస్ట్‌లోని స్టార్లు వీళ్లే..
ABN , Publish Date - Dec 06 , 2024 | 04:12 PM
Cricket: క్రికెటర్ల పుట్టిన రోజును అభిమానులు ఏ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటారో తెలిసిందే. తమ బర్త్‌డే మాదిరిగా కేకులు కోసి, స్వీట్లు పంచుతూ ప్లేయర్లపై తమకు ఉన్న ప్రేమను చాటుకుంటారు.
క్రికెటర్ల పుట్టిన రోజును అభిమానులు ఏ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటారో తెలిసిందే. తమ బర్త్‌డే మాదిరిగా కేకులు కోసి, స్వీట్లు పంచుతూ ప్లేయర్లపై తమకు ఉన్న ప్రేమను చాటుకుంటారు. క్రికెటర్లకు సంబంధించిన పోస్టులు పెడుతూ వారిపై అభిమానాన్ని చూపిస్తుంటారు. వాళ్లు బాగా ఆడిన మ్యాచ్ తాలూకు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తారు. ఈ రోజు కూడా నెట్టింట అలాగే సందడి చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఒక ప్లేయర్ కాదు.. ఏకంగా 12 మంది ఇంటర్నేషనల్ స్టార్ క్రికెటర్ల బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సహా ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆ స్టార్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా నుంచి వీళ్లే..
డిసెంబర్ 6వ తేదీన చాలా మంది స్టార్ క్రికెటర్లు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. వారిలో భారత్ నుంచి ఎక్కువ మంది ఉన్నారు. బుమ్రా, జడ్డూతో పాటు స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బర్త్‌డే కూడా ఇవాళే కావడం విశేషం. భారత్ తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన వారిలో ఒకడైన కరుణ్ నాయర్ కూడా శుక్రవారం పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. వెటరన్ పేసర్ రుద్రప్రతాప్ సింగ్ కూడా ఇవాళ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున అదరగొట్టిన సుయాష్ ప్రభుదేశాయ్ కూడా ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్న క్రికెటర్లలో ఒకడు.
విదేశీ స్టార్లు కూడా..
ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ పుట్టిన రోజు కూడా డిసెంబర్ 6వ తేదీనే కావడం విశేషం. అతడితో పాటు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ నాసిర్ జంషేద్, జింబాబ్వే మాజీ ప్లేయర్ సీన్ ఎర్విన్, ఐర్లాండ్ ఆటగాడు హ్యారీ టెక్టార్ కూడా ఇవాళే బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ స్టార్లకు క్రికెట్ లవర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇందులో ఇంకా గేమ్‌లో కొనసాగుతున్న వారు మరింత అద్భుతంగా ఆడుతూ అందర్నీ ఎంటర్‌టైన్ చేయాలని కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మరింత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని అంటున్నారు.
Also Read:
సచిన్‌ను గుర్తుచేసిన తెలుగోడు.. సేమ్ టు సేమ్
ఆసీస్‌కు పోయించిన తెలుగోడు.. కెరీర్‌లో మర్చిపోని ఇన్నింగ్స్
జేబులో కర్చీఫ్‌తో బ్యాటింగ్.. గిల్ ఎందుకిలా చేశాడో తెలుసా..
For More Sports And Telugu News