Share News

Ravindra Jadjea: ఆసీస్‌ను రెచ్చగొట్టిన జడేజా.. బ్యాట్‌ను కత్తిలా తిప్పుతూ..

ABN , Publish Date - Dec 17 , 2024 | 11:29 AM

Ravindra Jadjea: టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా జట్టును భయపెట్టాడు. స్టన్నింగ్ నాక్‌తో కంగారూలను వణికించాడు. ఆ తర్వాత బ్యాట్‌ను కత్తిలా తిప్పుతూ వాళ్లను రెచ్చగొట్టాడు.

Ravindra Jadjea: ఆసీస్‌ను రెచ్చగొట్టిన జడేజా.. బ్యాట్‌ను కత్తిలా తిప్పుతూ..
Ravindra Jadeja

IND vs AUS: టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎక్కువగా బంతితోనే మ్యాజిక్ చేస్తుంటాడు. అలాగే ఫీల్డింగ్‌లోనూ దమ్ము చూపిస్తుంటాడు. కట్టుదిట్టమైన స్పిన్ బౌలింగ్‌తో బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించడంలో అతడు సిద్ధహస్తుడు. ఫీల్డింగ్‌లో అసాధ్యమైన క్యాచ్‌లు అందుకోవడం, అద్వితీయ రనౌట్‌లు చేయడంలోనూ అతడికి అతడే సాటి. అలాగని బ్యాటింగ్‌లోనూ ఏం తక్కువ కాదు. అవసరమైన సమయంలో బరిలోకి దిగి బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపించడం జడ్డూకు వెన్నతో పెట్టిన విద్య. అదే మళ్లీ అతడు రిపీట్ చేశాడు. స్టన్నింగ్ నాక్‌తో కంగారూల బెండు తీశాడు.


ఎదురొడ్డి..

ఆస్ట్రేలియా జట్టును భయపెట్టాడు జడేజా. సూపర్బ్ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను వణికించాడు. గబ్బా టెస్ట్‌లో డేంజర్‌లో పడిన టీమ్‌ను ఆదుకున్నాడు. 88 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టార్మ్ బ్యాటర్ 52 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కమిన్స్, స్టార్క్, హేజల్‌వుడ్ నిప్పులు చెరిగే బంతుల్ని సమర్థంగా ఎదుర్కొని నిలబడ్డాడు. బౌన్సర్లు, యార్కర్లతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా క్రీజును వీడలేదు. ఈ తరుణంలో హాఫ్ సెంచరీ పూర్తయ్యాక అతడు తనదైన శైలిలో ఐకానిక్ స్వార్డ్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. యోధుడి మాదిరిగా బ్యాట్‌ను కత్తిలా తిప్పుతూ కంగారూ ఆటగాళ్లను రెచ్చగొట్టాడు. దీంతో బౌలర్ స్టార్క్ అతడ్ని ఏదో కామెంట్ చేస్తూ కనిపించాడు. అయినా జడ్డూ వెరవకుండా బ్యాటింగ్ కొనసాగించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:

షకీబ్‌ బౌలింగ్‌పై సస్పెన్షన్‌

అటు వర్షం.. ఇటు వికెట్లు

జట్టు సంధి దశలో ఉంది

Updated Date - Dec 17 , 2024 | 11:41 AM