Home » Tamil Nadu
కోర్టులో హాజరయ్యేందుకు వచ్చిన ఖైదీతో జైలులో ఉన్న భర్తకు గంజాయి ప్యాకెట్ పంపించిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఎర్నావూర్ సునామీ కాలనీ(Ernavur Tsunami Colony)కి చెందిన విజయ్ అనే వ్యక్తిని ఓ కేసులో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
జయమంగళం ఆంజనేయస్వామి(Jayamangalam Anjaneyaswamy) ఆలయానికి ప్రతిరోజు భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఆంజనేయస్వామి(Anjaneyaswamy)కి యాలకులు, లవంగాలతో రూపొందించిన మాల కానుకగా ఇవ్వాలని ఓ భక్తుడు నిర్ణయించుకున్నాడు.
అన్నాడీఎంకే నాయకులు క్షేత్ర సమీక్ష పేరుతో అలజడులకు కుట్ర పన్నుతున్నారని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) ధ్వజమెత్తారు. బుధవారం 48వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మెరీనా బీచ్‌లోని దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి స్మారక మందిరంలో ఉన్న కలైంజర్ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని చెన్నై(Chennai) ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ‘ఫెంగల్’ అనే ఈ తుఫాను ప్రభావం కారణంగా తమిళనాడు(Tamil Nadu)లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
ఓ యువకుడి మద్యం మత్తు ఐదుగురిని బలిగొంది. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో యువకుడు నడిపిన కారు ఐదుగురి ప్రాణాలను హరించివేసింది. పొట్టకూటి కోసం గొర్రెల కాపలాకు వెళ్లి, మధ్యాహ్నం రోడ్డు పక్కన చెట్టు కింద సేదతీరుతుండగా, హఠాత్తుగా దూసుకొచ్చిన కారు వారందరినీ మృత్యుఒడిలోకి నెట్టేసింది.
ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) నివాసగృహం పరిసరాల్లో కత్తితో సంచరించిన యువకుడిని పోలీసులు నిర్బంధించారు. తేనాంబపేట సెంటాఫ్ రోడ్డు(Thenambapet Centoff Road)లో స్టాలిన్ నివసిస్తున్నారు.
మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను ఈ ప్రభుత్వం సహించదని, దేశంలోనే మహిళలకు భద్రత కల్పించడంలో రాష్ట్రం ముందంజలో ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గీతాజీవన్(Minister Geethajeevan) స్పష్టం చేశారు.
భారత రాజ్యాంగ విలువలను ప్రతి పౌరుడు తెలుసుకుని పాటించాలని అగ్రహీరో, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్(Kamal Haasan) పిలుపునిచ్చారు. ఈ విషయంపై ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 75 యేళ్ళ క్రితం ఇదే రోజు దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం రూపొందిందన్నారు.
బంగాళాఖాతంలో ‘ఫెంగల్’ తుఫానుగా రూపుదిద్దుకోనున్న వాయుగుండం ప్రభావం కారణంగా నగరంలో మంగళవారం ఉదయం కుండపోతగా వర్షం కురిసింది. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమైనా తేలికపాటి జల్లులే కురిశాయి.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కించపరిచేలా, అగౌరవపరిచేలా మాట్లాడటం తప్పేనని, అందువల్ల ఈ కేసు విచారణ ఎదుర్కోవాల్సిందేనంటూ అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి సీవీ షణ్ముగంకు సుప్రీంకోర్టు(Supreme Court) తేల్చి చెప్పింది.