Home » TG Govt
రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలను సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది.
నూతన రెవెన్యూ చట్టాన్ని(ఆర్వోఆర్-2024) తీసుకురాబోతున్న వేళ ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ధరణిలో పెండింగ్‌లో ఉన్న పలు దరఖాస్తులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా అధికారులను ఆదేశించింది.
పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిశీలించి జీరో స్టేజికి తీసుకురావాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్‌మిత్తల్ ఆదేశించారు. దరఖాస్తులు వేగవంతంగా క్లియర్ చేసేందుకు ఎమ్మార్వోలకు అదనంగా లాగిన్లు ఇచ్చారు. రోజుకు వంద చొప్పున పెండింగ్ దరఖాస్తులు పరిశీలించాలని లక్ష్యం విధించారు.
రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్) దక్షిణభాగంలో మరో ముందడుగు పడింది. ఈ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించనున్న నేపథ్యంలో శరవేగంగా చర్యలు తీసుకుంటోంది.
వేలంలో విక్రయించిన ధాన్యం, దానికి సంబంధించిన నగదు వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. రైస్ మిల్లర్లు, వేలం సంస్థల ముక్కుపిండి మరీ.. బకాయిలను వసూలు చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. అయితే.. రైస్ మిల్లుల్లో వరిధాన్యం నిల్వలున్నాయా?
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వే 90 శాతం పూర్తయింది. సర్వేలో మొత్తం 1,16,93,698 నివాసాలు గుర్తించగా శనివారం వరకు 1,05,03,257 (90శాతం) నివాసాలలో సర్వే పూర్తి చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
కేంద్ర గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద రాష్ట్ర ప్రభుత్వానికి మరిన్ని నిధులు అందాయి. ఈ పద్దు కింద అక్టోబరులో రూ.1,452.71 కోట్లు వచ్చాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.3,899.74 కోట్లు వచ్చినట్లయింది.
ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఎన్నికల హామీలను కూడా అమలు చేయలేదని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు గట్టిగా సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నెల రోజులు పాటు నిర్వహించ తలపెట్టిన ప్రజాపాలన విజయోత్సవాలలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరి.. మరికొద్ది రోజుల్లో ఏడాది పూర్తి కావోస్తుంది. ఈ నేపథ్యంలో సంబురాలు నిర్వహించాలని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. అందుకోసం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం గాంధీ భవన్లో పార్టీ అగ్రనేతలు భేటీ కానున్నారు.