Home » TPCC Chief
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఆయన వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క ఉన్నారు. వీరితో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ జత కలువనున్నారు. ఆయన ఈ రోజు ఢిల్లీ వెళుతున్నారు. ముఖ్యనేతలంతా ఢిల్లీలో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణ కాంగ్రెస్ (Congress) పార్టీకి కొత్త బాస్‌పై ఉత్కంఠ నెలకొంది. అధ్యక్ష రేసులో ఎవరు ఉన్నారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటు ఏ సామాజికవర్గానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుదన్న విషయంపై ఏఐసీసీ కూడా దృష్టి సారించింది.
తెలంగాణ తదుపరి సీఎం ఎవరనేదానిపై తీవ్రమైన ఉత్కంఠ కొనసాగుతున్న వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యంలో ఒకరినొకరు అభినందించుకోవడానికి హోటల్ ఎల్లాకు వచ్చారు.
కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి బరిలో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారు. కొండల్‌రెడ్డి స్థానికేతరుడు అని గులాబీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొండల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉదయం నుంచి బీఆర్ఎస్ నేతలు తనను వెంబడించి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
Telangana Elections: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... పోలింగ్ రోజు ఇలాంటి ఘటనలకు తెరలేపారన్నారు. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని కోరారు.
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా నాలుగు రోజులే సమయమండడంతో ప్రధాన పార్టీల అగ్ర నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం ఆయా నియోజక వర్గాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించనున్నారు.
Telangana Elections: తెలంగాణ భవన్లో ఆటో యూనియర్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 నుంచి తెలంగాణలో మార్పు వచ్చిందా లేదా? అని ప్రశ్నించారు. అప్పుడున్న భూమి ధరలు ఇప్పుడున్న భూమి ధరలు ఒక్కసారి గమనించాలన్నారు.
Telangana Elections: ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గననున్న సభలు ఆలస్యంగా మొదలు కానున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా రేవంత్ హెలికాఫ్టర్ ప్రయాణం రద్దు అయ్యింది. హెలికాప్టర్ ప్రయాణం రద్దు కావడంతో రోడ్ మార్గంలో టీపీసీసీ అధ్యక్షులు ఆయా నియోజకవర్గాలకు బయలుదేరారు. దీంతో సభలు ఆలస్యంగా ప్రారంభంకానున్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు రేవంత్ నకిరేకల్‌కు చేరుకుని అక్కడి సభలో పాల్గొంటారు.
Telangana Elections: తెలంగాణ ప్రజలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. బీజేపీ - బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయని తెలిపారు. అత్యున్నత ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను కూడా మోడీ, కేసీఆర్ రాజకీయ క్రీడలో పావులుగా మార్చేశారని విమర్శించారు.
Telangana Elections: దుబ్బాకకు రావలసిన నిధులు మామ అల్లుళ్ళు సిద్దిపేటకు తరలించుకు పోయిండ్రని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గురువారం దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ విజయభేరీ సభలో రేవంత్ మాట్లాడుతూ.. మూడేండ్లలో రఘునందన్ రావు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట తప్పిన బీజేపీ ఎమ్మెల్యేకు ఓటు అడిగే హక్కు లేదన్నారు.