Home » Telangana » Hyderabad
ఏడాది కాంగ్రెస్ పాలన పాత చీకటి రోజులను గుర్తు చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి అన్నారు. శిల్ప శాస్త్రం ప్రకారం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించారని చెప్పారు. తెలంగాణ తల్లి గొప్పగా ఉండాలి.. కానీ బీదగా ఉండవద్దని తెలిపారు. ప్రజల భావోద్వేగాలను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసే కుట్ర చేస్తోందని వాణిదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి కేటీఆర్ని ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ ఉద్యమం ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. లగచర్ల రైతులకు బెయిల్ రాకుండా కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు.
Telangana: ముందస్తు బెయిల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంపై నటుడు మోహన్ బాబు తాజాగా స్పందిస్తూ.. అసలు పిటిషన్ రిజక్ట్ అవ్వలేదని చెప్పుకొచ్చారు. మీడియా నిజాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఎక్స్లో మోహన్ బాబు పోస్టు చేశారు.
గ్రూప్ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్ టికెల్, ఒరిజినల్ గుర్తింపు కార్డుతో హాజరు కావాలని సూచించారు. అభ్యర్ధులు ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రాలను పరిశీలించుకోవాలని సూచించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లను భ్రష్టు పట్టించారని మంత్రి పొన్న ప్రభాకర్ మండిపడ్డారు. ప్రభుత్వ హాస్టల్స్పై శాసన సభలో చర్చిద్దాం రావాలని సవాల్ విసిరారు. హాస్టల్స్ విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మాజీ సీఎం కేసీఆర్ వియ్యంకుడు, ఎమ్మెల్సీ కవిత మామ, బీఆర్ఎస్ సీనియర్ నేత రాంకిషన్రావుపై కేసు నమోదైంది. నిజామాబాద్లో ఓ స్థల వివాదం విషయంలో..
విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. విద్యార్థులు గురుకులాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మూవీ 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మరణించిన కేసులో శుక్రవారం హైదరాబాద్ పోలీసులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
‘పుష్ప 2 ది రూల్' మూవీ ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మరణించిన కేసులో శుక్రవారం హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన అధికారులు జైల్లో ఉంచడంపై కోర్టు ధిక్కరణ కేసు వేసే అవకాశం ఉంది.
అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తాను ఎవరిపై ఆరోపణలు చేయడం లేదని చిన్ని కృష్ణ వెల్లడించారు. యావత్ భారతదేశం మొత్తం దుఖంలో ఉందని.. ఆ రియాక్షన్ ఏమిటో త్వరలో చూస్తారని ఆయన పేర్కొన్నారు.