Share News

Allu Arjun: జైలు నుంచి విడుదలయ్యాక అల్లు అర్జున్ ఏమన్నారంటే...

ABN , Publish Date - Dec 14 , 2024 | 09:12 AM

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun)ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మూవీ 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మరణించిన కేసులో శుక్రవారం హైదరాబాద్ పోలీసులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Allu Arjun: జైలు నుంచి విడుదలయ్యాక అల్లు అర్జున్ ఏమన్నారంటే...

హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun)ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మరణించిన కేసులో శుక్రవారం హైదరాబాద్ పోలీసులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ(శనివారం) ఉదయం 6:45 గంటలకు చంచల్ గూడ జైలు నుంచి ఆయన విడుదల అయ్యారు. బెయిల్‌ ఆర్డర్‌ కాపీ పరిశీలన అనంతరం జైలు వెనుక గేటు నుంచి అధికారులు పంపించారు. మధ్యంతర బెయిల్‌పై అల్లు అర్జున్‌ విడుదలయ్యారు. 4 వారాల మధ్యంతర బెయిల్‌‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది.


చట్టాన్ని గౌరవిస్తా...

జైలు నుంచి గీతా ఆర్ట్స్‌ ఆఫీస్‌కు అల్లు అర్జున్‌ వెళ్లారు. అనంతరం గీతా ఆర్ట్స్‌ ఆఫీస్‌ నుంచి ఆయన నివాసానికి చేరుకున్నారు.. ఈ సందర్భంగా మీడియాతో అల్లు అర్జున్‌ మాట్లాడారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. కోర్టులో కేసు ఉంది.. ఇప్పుడు తాను ఏం మాట్లాడలేనని తెలిపారు. తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆ రోజు జరిగిన ఘటన యాదృచ్చికమని అన్నారు. తాను బాగున్నా.. ఆందోళన చెందవద్దని చెప్పారు. గత 20 ఏళ్లుగా థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తుంటానని అల్లు అర్జున్ తెలిపారు. బాధితురాలు రేవతి కుటుంబానికి అల్లు అర్జున్‌ సానుభూతి తెలిపారు.


4 వారాల మధ్యంతర బెయిల్‌‌..

మధ్యంతర బెయిల్‌పై అల్లు అర్జున్‌ ఈరోజు విడుదలయ్యారు. 4 వారాల మధ్యంతర బెయిల్‌‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో అల్లు అర్జున్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్‌ వచ్చినా రాత్రంతా జైలులోనే అల్లు అర్జున్‌ ఉన్నారు. బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇవాళ విడుదల చేశారు. అల్లు అర్జున్‌తో పాటు సంధ్యాథియేటర్‌ యాజమాన్యాన్ని కూడా విడుదల చేశారు. చంచల్‌గూడ జైలుకు ఇప్పటికే అల్లు అరవింద్‌ చేరుకున్నారు. జైలు అధికారులకు బెయిల్‌ ఆర్డర్‌ కాపీ అందజేశారు. మంజీరా బ్యారక్‌ నుంచి అడ్మిషన్‌ బ్యారక్‌కు అల్లు అర్జున్‌ను తరలించినట్లు సమాచారం. అల్లు అర్జున్‌ కోసం జైలుకు ఆయన బాడీగార్డ్స్‌ చేరుకున్నారు. చంచల్‌గూడ జైలు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.


జైలు అధికారులు ఏమన్నారంటే..

అల్లు అర్జున్‌ను ఉదయం 6.45 గంటలకు విడుదల చేశామని జైలు అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా అల్లు అర్జున్‌ను వెనుక గేటు నుంచి పంపించామని చెప్పారు. అల్లు అర్జున్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను విడుదల చేశామని అన్నారు. సంధ్యా థియేటర్‌ యజమానిని విడుదల చేశామని జైలు అధికారులు వెల్లడించారు. అల్లు అర్జున్‌ బెయిల్ పేపర్లు అందడానికి ఆలస్యమైందని జైలు అధికారులు తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత బెయిల్‌ పేపర్లు అందాయని జైలు అధికారులు తెలిపారు. చంచల్‌గూడ జైలు నుంచి గీతా ఆర్ట్స్‌ కార్యాలయానికి అల్లు అర్జున్‌ చేరుకున్నారు. గీతా ఆర్ట్స్‌ ఆఫీస్‌ నుంచి నివాసానికి చేరుకునే అవకాశం ఉంది. అల్లు అర్జున్‌ నివాసం దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Allu Arjun: చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్‌ విడుదల

Hyderabad: సీఎం రేవంత్‏కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ.. దాంట్లో ఏమున్నదంటే..

For Telangana News And Telugu News

Updated Date - Dec 14 , 2024 | 09:49 AM