Share News

TG NEWS:అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై మంత్రుల షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Dec 14 , 2024 | 11:57 AM

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లను భ్రష్టు పట్టించారని మంత్రి పొన్న ప్రభాకర్ మండిపడ్డారు. ప్రభుత్వ హాస్టల్స్‌పై శాసన సభలో చర్చిద్దాం రావాలని సవాల్ విసిరారు. హాస్టల్స్ విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

TG NEWS:అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై మంత్రుల షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun)ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 'పుష్ప 2.. ది రూల్' ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మరణించిన కేసులో శుక్రవారం హైదరాబాద్ పోలీసులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ(శనివారం) ఉదయం 6:45 గంటలకు చంచల్ గూడ జైలు నుంచి అల్లు అర్జున్‌ విడుదల అయ్యారు. అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై కాంగ్రెస్ మంత్రులు హాట్ కామెంట్స్ చేశారు. సినిమాను, కళలను ప్రోత్సహించే ఆలోచనతో తమ ప్రభుత్వం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. సినిమా వాళ్లు, అల్లు అర్జున్‌పై తమ ప్రభుత్వానికి ఎందుకు కోపం ఉంటుందని అన్నారు. కోపం ఉంటే దిల్ రాజు‌ను తాము ఎందుకు చైర్మన్ చేస్తామని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంతో పాటు విచక్షణ కోల్పోయిందని ధ్వజమెత్తారు. అందుకే ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తుందని ఆగ్రహించారు. బీఆర్ఎస్ నేతలకు చట్టం పట్ల అవగాహన ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.


సంధ్యా ధియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ చనిపోయినప్పుడు మాట్లాడని మాజీ మంత్రి కేటీఆర్‌కు ఇప్పుడు మాట్లాడే అర్హత లేదని అన్నారు. సిరిసిల్లలో చేనేత కార్మికులు చనిపోయినప్పుడు కేటీఆర్‌పై మర్డర్ కేసులు పెట్టారా అని నిలదీశారు. అప్పుడు వారిపై కేసు పెడితే ఇప్పుడు తమ ప్రభుత్వంపై పెట్టవచ్చని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ప్రభుత్వ హాస్టల్స్‌పై శాసన సభలో చర్చిద్దాం రావాలని సవాల్ విసిరారు. హాస్టళ్లను తాము నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. హాస్టల్స్ విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.బీఆర్ఎస్ పదేళ్ల పొరపాట్లను సరిచేయడానికి తమకు ఏడాది సమయం పట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.


అల్లు అర్జున్ అరెస్టుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

seethakka.jpg

నిర్మల్ :అల్లు అర్జున్ అరెస్టుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్‌పై తమకేమి కక్ష లేదని, ఆయన అరెస్టు చట్ట ప్రకారమే జరిగిందని చెప్పారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని స్పష్టం చేశారు. చిరంజీవి, అల్లు అర్జున్ మామ కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులేనని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డితో బంధుత్వం కూడా ఉందని గుర్తుచేశారు. అయినా పోలీసులు చట్ట ప్రకారం వ్యవహారించారని అన్నారు. అత్యంత మారుమూలన ఉన్న కడెం మండలం గంగాపూర్ గ్రామానికి రూ. 22 కోట్ల నిధులతో వంతెన నిర్మాణానికి మంత్రి సీతక్క ఇవాళ(శనివారం) శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొన్నారు.


గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లు అని అన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే హామీ మేరకు వంతెన నిర్మాణం చేయబోతున్నామని చెప్పారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు గ్రామాలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Allu Arjun: చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్‌ విడుదల

Hyderabad: సీఎం రేవంత్‏కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ.. దాంట్లో ఏమున్నదంటే..

For Telangana News And Telugu News

Updated Date - Dec 14 , 2024 | 12:02 PM