Home » Telangana » Karimnagar
నేతకాని కులం గురించి మాట్లాడిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి క్షమాపణ చెప్పాలని తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం మారుతి డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేతకాని కులాన్ని మాలనేతగా మార్చాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడడాన్ని మీడియాలో చూశామన్నారు. ఇది తమను ఎంతో బాధించిందన్నారు.
ర్యాగింగ్, టీజింగ్, పనిస్థలాల్లో వేధింపుల నియంత్రణ కోసం రూపొందించిన పోస్టర్‌ను కమిషనరేట్ కేంద్రంలో అడిషనల్ డీసీపీ ఎ లక్ష్మీనారాయణ గురువారం ఆవిష్కరించారు.
యాసంగి పంటల సాగు ప్రణాళికపై కొత్తపల్లి మండలంలోని బద్దిపల్లి రైతు వేదికలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం, కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో దత్తత గ్రామమైన కొత్తపల్లి మండలంలోని నాగుల మల్యాల రైతులకు అవగాహన కల్పించారు.
వైద్యవృత్తిని ఎంచుకున్న విద్యార్థులు విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలందరూ సహకరించా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు.
ప్రభుత్వం గ్రామా ల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొను గోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు.
రాష్ట్రంలో ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ప్రగతి ప్రణాళికలు రూపకల్పన కోసం తమ ప్రజా ప్రభుత్వం ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
కమిషనరేట్ వ్యాప్తంగా షీ టీంలు పోకిరీలకు దడపుట్టిస్తున్నాయి. పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి పర్యవేక్షణలో కమిషనరేట్ వ్యాప్తంగా 10కిపైగా షీ టీంలు పనిచేస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి చేపట్టాల్సిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం మరో రెండు రోజులు ఆగాల్సిందే. సర్వేకు సంబంధించిన 75 ప్రశ్నలతో కూడిన ఫార్మాట్ ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ, అందులో కొన్ని చేర్పులు, మార్పులు చేయాలని భావించిన ప్రభుత్వం తుది ఫార్మాట్‌ను ఇంకా విడుదల చేయలేదు. దీంతో సర్వే ఈనెల 9వ తేదీ నుంచి చేపట్టనున్నారు.
గూడు లేని పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి విధి విఽధానాలు రావడంతో దరఖాస్తుదారుల్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. గత నెలలో ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాల కోసం పూర్తి చేసిన ఇందిరమ్మ కమిటీలకు త్వరలో ఆమోదం లభించనుంది.