Home » Telangana » Warangal
వర్షాకాలం వచ్చేసింది. అంటువ్యాఽధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వైద్యా ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లాలో వ్యాఽధులు విజృంభించకుండా చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణకు సిద్ధమైంది. అయితే.. ప్రతి ఏటా అప్రమత్తంగానే ఉన్నామని అధికారులు చెబుతున్నా వ్యాధుల నిర్మూలన సాధ్యం కావడం లేదు.
హైదరాబాద్(Hyderabad) నడిగడ్డతండా(Nadigadda Tanda)లో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని మంత్రి సీతక్క(Minister Seethakka) పరామర్శించారు. మరిపెడ మండలం ఎల్లంపేటలోని బాధిత గిరిజన కుటుంబాన్ని మంత్రి సీతక్క స్వయంగా వెళ్లి ఓదార్చారు.
మహబూబాబాద్: బయ్యారంలో దారుణం జరిగింది. ఓ కిరాణా వ్యాపారి 10 కోట్ల రూపాయలతో పరారయ్యాడు. దీంతో విషయం తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
గ్రామాల్లో సర్పంచ్ల పదవీకాలం గత జనవరితో ముగియగా ప్రభుత్వం పంచాయతీల పాలనా బాధ్యతలను అధికారులకు అప్పగించింది. ప్రతీ గ్రామానికి గెజిటెడ్ అధికారుల ను ప్రత్యేక అధికారిగా నియమించింది. అధికారులు కార్యాలయాలకే పరిమితం అవుతుండడం... ఉన్నతా ధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పల్లెల్లో పాలన పట్టుతప్పుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వానాకాలం ప్రారంభానికి ముందే సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. ములుగు ఏజెన్సీ ప్రజలను ముఖ్యంగా గొత్తికోయగూ డేలను ప్రతీయేడు భయపెట్టే మలేరియా, డెంగీ ఈసారి పడగ విప్పుతున్నాయి. ప్రస్తుతం గొత్తికోయ గూడేల్లో పాజిటివ్ కేసులు వెలుగు చూడటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వ్యాధులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడంతోపాటు రోగికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
బీఆర్ఎస్(BRS) పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుందా? కీలక నేత ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. మంత్రి అవ్వాలనే తన కలను నేరవేర్చిన కేసీఆర్‌కు(KCR) హ్యాండిచ్చేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో(Congress Party) చేరేందుకు చర్చలు మొదలుపెట్టారా? అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది.
మిషన్ భగీరథ అనే బృహత్ పథకం కింద రాష్ట్రంలో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని గత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేసింది. ఇంటింటికీ తాగునీరు అందుతున్నపుడు ప్రత్యేకంగా మళ్లీ నిధులెందుకని అభ్యంతరం తెలిపింది. మరోవైపు గత ప్రభుత్వం ప్రకటించినట్లుగా రాష్ట్రంలో వందశాతం తాగునీరు అందడం లేదు. క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు రాబట్టాలంటే ఇంటింటా సర్వే చేసి కేంద్రానికి నివేదించాలని ప్రస్తుత సర్కారు భావించి అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా ఈ నెల 10వ తేదీనుంచి జిల్లాలో సర్వే కొనసాగుతోంది.
నిరుపేదల కు నిరీక్షణ తప్పడం లేదు. కొత్త రేషన్‌కార్డుల కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నా మోక్షం కలగడం లేదు. తొమ్మిదేళ్ల క్రితం నిలిచిపోయిన రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నేటికీ పునరుద్ధరించుకోలేదు. దీంతో దారిద్య్ర రేఖకు దిగువనున్న (బీపీఎల్) కుటుంబాలకు నిరాశే ఎదురవుతోంది.
వేసవి సెలవులు ముగించుకొని నేటి నుంచి పాఠశా లలు పునఃప్రారంభం కానున్నాయి. రుతుపవనాలు పూర్తి స్థాయిలో జిల్లాకు రానప్పటికీ వాతావరణం మా త్రం ఓ పూట ఎండ, ఓ పూట మబ్బులా ఉంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను సబ్జెక్టు టీచర్లు, స్కా వెంజర్లు, అటెండర్ల కొరత వేధిస్తూనే ఉంది.
బడి గంటలు మోగాయి. బుధవారం నుం చి ప్రభుత్వ పాఠశాలు పునఃప్రారం భమవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తంగా 420 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 20,710 మంది విద్యార్ధులు చవువుతున్నారు. మరో 30 పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ నమోదైంది. 20 నుంచి 30 పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతులు ఆంగ్ల మాద్యమం ప్రారంభం కాకపోగా మిగతా అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్య మ తరగతులను నిర్వహిస్తున్నారు.