Home » Telangana » Warangal
ఓరుగల్లు కాకతీయ కళాతోరణం.. ఇది కాకతీయుల సుపరిపాలనకు, ఓరుగల్లు అస్తిత్వాన్ని చాటే చిహ్నమన్నది అందరికీ తెలిసిందే. అలాంటి ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ కళాతోరణాన్ని తెలంగాణ రాష్ట్ర రాజముద్ర నుంచి తొలగించడం పట్ల ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలైతే భగ్గుమంటున్నాయి. వరంగల్ కేంద్రంగా మరో ఉద్యమానికి ప్రణాళిక రూపొందిస్తున్న బీఆర్ఎస్.. ఓరుగల్లు ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇక బీజేపీ కూడా కళాతోరణం వివాదం నేపథ్యంలో సమరానికి సై అంటోంది.
సింగరేణి భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్ కాస్టు ప్రాజెక్టు-3లో భూములు కోల్పోయిన నిర్వాసితుల నుంచి కొనుగోలు చేసిన కలప పాడైపోతోంది. రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన కర్రకు చెదలు పడుతున్నా సింగరేణి అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో సింగరేణి కార్యాలయం ఆవరణలో నిల్వ ఉంచిన కలప ఎండకు ఎండుతూ... వానకు తడుస్తోంది.
కొండాయి.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల పరిధిలోని ఓ అడవిపల్లె. ప్రశాంతతకు మారుపేరుగా ఉండే ఈ గ్రామం గతేడాది జూలైలో జంపన్నవాగు జలవిలయానికి విలవిల్లాడింది. ఎనిమిది మంది గ్రామస్థులు వరదలో కొట్టుకుపోయి మరణించారు. హైలెవల్ వంతెన కూలి పోయింది. దాంతో ఆ గ్రామస్థులను ఎత్తైన సురక్షిత ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణకు తెలంగాణ వైద్య మండలి నడుం బిగించింది. ప్రజలకు నాణమైన వైద్యం అందాలన్న లక్ష్యంతో చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరచడంతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సంకల్పించింది.
అంగన్వాడి కేంద్రాల్లో అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న పౌష్ఠికాహారం పక్కదారి పట్టకుండా ఉండేలా, పక్కాగా సాగేందుకు కార్యాచరణ రూపొందించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ సర్వేను ప్రారంభించింది. న్యూట్రిషియన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ (ఎన్‌హెచ్‌టీఎస్) ద్వారా అంగన్వాడి టీచర్లు గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన ఈ సర్వే ప్రక్రియకు ఎన్నికల కారణంగా కొం త జాప్యం జరిగింది.
గ్రామ పంచా యతీల నిర్వహణ కష్టతరంగా మారింది. జనవరి 31తో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ఫిబ్ర వరి 1 నుంచి ప్రత్యేకాధికారుల పాలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గెజిటెడ్ స్థాయి అధికారులను స్పెషలాఫీస్లుగా నియమించింది. ఒక్కొక్కరికి రెండ్రెం డు జీపీల బాధ్యతలు సైతం కట్టబెట్టింది. అయితే.. అన్నీ తమై పంచాయతీల నిర్వహణ చూసుకోవాల్సిన ప్రత్యేకాధికారులు పలువురు చుట్టపుచూపుగా వచ్చిపోతూ పరిపాలన వ్యవహారాలను పట్టించుకోవ డం లేదనే విమర్శలు వస్తున్నాయి.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు 101 జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు.
బహుజనుల నాయకుడు పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన కోట రోజు రోజుకూ శిథిలమవుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామంలో గుట్టపైన, గుట్ట దిగువ భాగాన పాపన్న నిర్మించిన కోట గోడలు, గడీ కాలక్రమేణా శిథిలావస్థకు చేరుతున్నాయి. వాటిని పునరుద్ధరించినట్లైతే ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా విలసిల్లుతుందని మండల ప్రజలు కోరుతున్నారు.
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ పేషీలో ఓ ఉద్యోగి పాత ఫైళ్ల (ఎంబీ బుక్కు)పై బదిలీపై వెళ్లిన కమిషనర్ సంతకాలతో డబ్బులు డ్రా చేసిన వైనంపై ఇంటెలిజెన్స్ పోలీసులు దృష్టి సారించారు. ఈ తతంగంపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ‘పాత ఫైళ్లపై బిల్లులు’ అనే కథనం ప్రచురించింది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు నాలుగురోజులుగా కూపీ లాగుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (జడ్పీటీసీ లు), మండల పరిషత్తుల ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ లు) ఎన్నికలు గడువులోపు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో గ్రామ పంచాయతీలకు మాదిరిగానే జిల్లా, మం డల పరిషత్తులకు కూడా ప్రత్యేక పాలనాధికారులను నియమిం చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రాదేశిక ని యోజవర్గాల పాలక వర్గాల గడువు జూలై 4వ తేదీతో ము గియనున్నది.