MP Raghurama : సుప్రీంలో వాదనలు చూస్తుంటే చంద్రబాబుకు రిలీఫ్ ఖాయమనిపిస్తోంది

ABN , First Publish Date - 2023-10-03T15:41:45+05:30 IST

సుప్రీంకోర్టు(Supreme Court)లో వాదనలు చూసిన తీరు చూస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు రిలీఫ్ ఖాయం అనిపిస్తుందని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju ) వ్యాఖ్యానించారు.

MP Raghurama : సుప్రీంలో వాదనలు చూస్తుంటే చంద్రబాబుకు రిలీఫ్ ఖాయమనిపిస్తోంది

ఢిల్లీ: సుప్రీంకోర్టు(Supreme Court)లో వాదనలు చూసిన తీరు చూస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు రిలీఫ్ ఖాయం అనిపిస్తుందని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju ) వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలో తన నివసంలో మీడియాతో మాట్లాడుతూ..‘‘ చంద్రబాబు నాయుడు కేసుపై సుప్రీంకోర్టులో సుధీర్ఘంగా వాదనలు కొనసాగాయి. హరీష్ సాల్వే(Harish Salve) స్పష్టంగా వాదనలు వినిపించారు. స్కిల్ స్కాం డెవలప్‌మెంట్ కేసులో ఏపీ ప్రభుత్వం దగ్గర ఏ ఆధారాలు లేవు. పుంగనూరు, అంగళ్లు కేసులో బెయిల్ అందరికీ వచ్చింది. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కేసులు పెట్టారు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌(Nara Lokesh)కి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ నోటీసు ఇచింది. లోకేష్‌ను ఏపీ సీఐడీ రేపు అరెస్ట్ చేస్తా మంటే ఎలా..? న్యాయ స్థానాలు ఇంత అన్యాయం జరుగుతుంటే ఖండించాలి. నిన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. బండారు సత్య నారాయణమూర్తి నివాసంపై పోలీసులు దాడి చేసి తలుపులు బద్దలు కొట్టారు. అసెంబ్లీ లో ఒక రూల్ ఇక్కడ మరో రూల్ పెట్టవద్దు. 41a నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయడం ఏంటి...? టైమ్స్ ఆఫ్ ఇండియాలో వైసీపీ పార్టీకి 25 ఎంపీ సీట్లు వస్తాయని సర్వేల్లో తెలింది. ఇది పిట్టల దొర సర్వే అని జనం నవ్వుకుంటున్నారు.

జనసేన, టీడీపీ పొత్తుతో నా పార్లమెంట్‌లోనే 3లక్షల మెజార్టీ వస్తుంది. అసలు ఆ సర్వే ఏంటి దాన్ని ఎలా వేసుకున్నారు ఆ పేపర్లో. టీడీపీ, జనసేన క్యాడర్ కలిసి పని చేసుకుంటున్నారు. కావాలని సాక్షిలో కలిసి పని చేయడం లేదని వేసుకుంటు న్నారు..అసలు మీకేంటి అంత బాధ....?మా జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ పార్టీకి రాదు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి 15 అసెంబ్లీ సీట్లు మించి రావు. మా జిల్లాల్లో 7 అసెంబ్లీ సీట్లలో ఒక్క సీటు కూడా వైసీపీకి రాదు’’ అని ఎంపీ రఘురామ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-03T15:41:45+05:30 IST