Raghurama: లోకేష్ నిరాహార దీక్షకు సంఘీభావం
ABN , First Publish Date - 2023-10-02T15:25:01+05:30 IST
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ నేత నారా లోకేష్(Nara Lokesh) సత్యగ్రహా నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) సంఘీభావం తెలిపారు.
ఢిల్లీ: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ నేత నారా లోకేష్(Nara Lokesh) సత్యగ్రహా నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రఘురామ మీడియాతో మాట్లాడుతూ...‘‘జగన్ జైలు జీవితం వేరు, దేశ స్వాతంత్రం కోసం గాంధీ జైలు జీవితం వేరు. మహాత్మాగాంధీ జన్మదినం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఒకరోజు నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. పార్టీలకు, కులాలకు అతీతంగా అందరూ గాంధేయ మార్గంలో నిరసన దీక్ష చేపట్టారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న దమన నీతికి అతీతంగా నేను నిరసన తెలుపుతున్నాను. లోకేష్ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపాను. ఐదుగంటల తర్వాత నారా భువనేశ్వరి కూడా మాట్లాడుతారు.‘‘మొతా మోగిద్ధాం’’ కార్యక్రమంలో సౌండ్ చేశారని పోలీసులు కొందరి పై కేసులు పెట్టారని తెలిసింది. ప్రజా న్యాయస్థానంలో ప్రజలు మీ బొమ్మలను చూసి అస్యహించుకుంటున్నారు. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవనీగడ్డలో నాలుగో విడత వారాహి యాత్రపై క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌పై వారి కులం వారితో ఎన్ని మాటలు అనిపించిన ఫలితం లేదు.
చంద్రబాబుతో ఎలాంటి విబేధాలు లేవని పవన్ చెప్పారు. జగన్‌రెడ్డి అవినీతి చేసిన అంత డబ్బును ఏం చేస్తారని పవన్ కళ్యాణ్ అన్నారు. మనో రుగ్మతతో బాధ పడుతున్నా వారు ఎవరనేది అర్థం అవుతుంది. పాండవులు ఎంతమంది అనేది జగన్‌కి తెలిసి ఉండకపోవచ్చు. కౌరవులు ఎంతమంది అనేది కూడా జగన్‌కి తెలిసి ఉండకపోవచ్చు. దుర్యోధనుడు, శకుని ఎవరు అనేది తెలుసు. భారతం గురించి జగన్ కూడా తెలుసుకుంటే మంచిది. భాస్కర్‌రెడ్డికి 11 రోజులు కండిషన్ బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన మరో రెండు నెలలు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది. బీజేపీ మద్దతు కూడా ఇస్తుందనేది నా భావన. పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయం చెప్పారు. తెలుగుదేశం, జనసేన కలిసి వెళ్తుందని చెప్పారు. వైసీపీ కోటాలు బిటాలు పారాయి. జగన్ ధనవంతుడు ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు’’ అని రఘురామ పేర్కొన్నారు.