Devineni Uma: ఉండవల్లి దమ్ముంటే జగన్‌పై హైకోర్టులో పిల్ వేయి

ABN , First Publish Date - 2023-09-22T20:56:02+05:30 IST

న్యాయస్థానాలుపై తెలుగుదేశం పార్టీకి పూర్తి నమ్మకం ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) వ్యాఖ్యానించారు.

Devineni Uma: ఉండవల్లి దమ్ముంటే జగన్‌పై హైకోర్టులో పిల్ వేయి

రాజమండ్రి: న్యాయస్థానాలపై తెలుగుదేశం పార్టీకి పూర్తి నమ్మకం ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎలాంటి ఆధారాలు లేకుండా వైసీపీ ప్రభుత్వం(YCP Govt) రాజకీయ కక్షతో చంద్రబాబు(Chandrababu) ను అక్రమంగా అరెస్ట్ చేసింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్‌రెడ్డి(Jagan Reddy) కుట్రతో చంద్రబాబును జైలులో పెట్టారు. 52 నెలలుగా జగన్ కోర్టుకు ఎందుకు హాజరుకావటం లేదు. బాబాయ్ హత్య కేసులో అవినాష్‌రెడ్డి జైలుకు వెళ్తారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జగన్‌రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఉండవల్లి అరుణ్ కుమార్(Undavalli Arun Kumar) ఓ సన్నాసి... వైసీపీ ప్రభుత్వానికి తొత్తు. లిక్కర్‌పై ఎందుకు హైకోర్టులో రిట్ వేయవు. దమ్ము దైర్యం ఉంటే 2.50 లక్షల కోట్లు తిన్న జగన్‌పై హైకోర్టులో పిల్ వేయండి. జగన్ పనై పోయింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు జగన్‌కు బుద్ది చెబుతారు’’ అని దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-22T21:14:12+05:30 IST