Sajjala: ‘అవినాష్‌రెడ్డి అరెస్ట్ అంటూ ప్రచారం.. అదే జరిగితే..’
ABN , First Publish Date - 2023-02-24T14:53:41+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ పేరిట డ్రామా జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు.
తాడేపల్లి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Former Minister YS Vivekanandareddy) హత్య కేసులో సీబీఐ (CBI) విచారణ పేరిట డ్రామా జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Government Advoiser Sajjala Ramakrishna Reddy) విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... సునీల్ యాదవ్ (Sunil Yadav) హత్య చేసి ఉంటే అలాంటి ఆధారం పక్కాగా ఉంటే ఎప్పుడో వచ్చేదన్నారు. చంద్రబాబు (Chandrababu Naidu) హయాంలో నుంచి జరిగిన పరిణామాలను సీబీఐ విచారణ (CBI Investigation)లో తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలి నుంచి సిట్ చేసిన విచారణను సీబీఐ కట్టకట్టి పక్కన పెట్టిందని విమర్శించారు. వివేకా హత్య (Viveka Case)జరిగినప్పటి నుంచి సిట్ (SIT) జరిపిన విచారణను తీసుకోవడం లేదన్నారు. హత్య చేసినట్లు చెబుతున్న వారంతా వివేకాతో పాటు దశాబ్దాలుగా ఉన్నవారే అని చెప్పుకొచ్చారు. వారు హత్య చేశారు అంటే దాని వెనుక ఉన్న కారణాలను చూడాలని ఆయన సూచించారు.
అది కూడా వివేకా హత్యకు కారణమై ఉండొచ్చు కదా...
వివేకా హత్య జగన్ (YS Jagan Reddy)కు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా నష్టాన్ని కలిగించిందన్నారు. వివేకా హత్య కేసులో న్యాయం జరగాలని, హత్య చేసిన వారికి శిక్ష పడాలనే తాము కోరుకుంటున్నామని తెలిపారు. సిట్ రిపోర్టు (SIT Report)ను పరిగణనలోకి తీసుకోకుండా సీబీఐ విచారణ జరపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, చంద్రబాబు (TDP Chief) చెప్పిన దాని ప్రకారమే సీబీఐ కింది స్థాయి అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్ క్యారెక్టర్ (Jagan character)ను చెడ్డగా చేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. వాంగ్మూలాలను మార్చి, చెప్పినవీ, చెప్పనివీ రాయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వివేకా బావమరిది శివప్రకాశ్ రెడ్డే (Shivaprakash Reddy) అవినాష్ రెడ్డి (Avinash Reddy)కి ఫోన్ చేసి హత్య విషయం చెప్పారని తెలిపారు. వివేకా గుండెపోటు (Heart Attack)తో చనిపోయారని వివేకా బావమరిదే చెప్పారన్నారు. వివేకా ఫోన్‌లోని కాల్ డేటా (Call data)ను ఎందుకు డిలీట్ చేశారో తెలియాల్సి ఉందన్నారు. రెండో పెళ్లి విషయం కూడా వివేకా హత్యకు కారణం అయి ఉండవచ్చని అప్పట్లో వార్తలు వచ్చాయని... వివేకా కుటుంబమంతా ఒక్కటై వివేకా చెక్ పవర్ తీసేశారని తెలిసిందన్నారు. రెండో పెళ్లి హత్యకు ఎందుకు కారణం కాకూడదనే కోణంలో ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. వివేకాను వైఎస్ జగన్ సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారని గుర్తుచేశారు. హత్యకు రెండు మూడు రోజుల్లో చంద్రబాబు (Former Chief minister), ఆదినారాయణరెడ్డి (Adinarayana Reddy) ఏం చేశారో సీబీఐ ఎందుకు విచారించడం లేదని ప్రభుత్వ సలహాదారు నిలదీశారు.
జగన్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా...
బెయిల్ విషయంలో సీబీఐ అఫిడవిట్‌లో రాసినవి చూస్తే నవ్వొస్తుందని అన్నారు. వివేకా హత్య కేసులో తప్పుడు ప్రచారం చేస్తూ జగన్ (AP CM) వైపు తీసుకువచ్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సీబీఐ విచారణను చంద్రబాబు ప్రభావితం చేయిస్తున్నారన్నారు. బీజేపీ (BJP)లో కోవర్టులుగా ఉన్న తన మనుషుల ద్వారా విచారణను చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారని వ్యాఖ్యలు చేవారు. సీబీఐ విచారణ తీరుపై తాము సరైన సమయంలో కేంద్రాని (Central Government)కి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వివేకా హత్య కేసులో సిట్ రిపోర్టును బయటపెట్టడం లేదని, బయట పెడితే ఏం జరిగిందో తెలుస్తుందన్నారు. తాము అనని మాటలను అన్నట్లుగా సీబీఐ చెబుతోందని కొందరు చెబుతున్నారని అన్నారు. 2024 ఎన్నిక(2024 Elections)ల్లో జగన్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. హత్యకేసులో హంతకుడు అప్రూవర్‌గా మారడమే తప్పని.. అప్రూవర్‌గా మారిన హంతకుడు చెప్పిన వాటిని పూర్తి ఆధారంగా తీసుకోకూడదని చట్టం చెబుతోందని సజ్జల తెలిపారు.
కుట్రదారులెవరో తేలాలి....
గూగుల్ టెక్ ఔట్ అనేది కొత్తగా వింటున్నామన్నారు. కొత్తగా శశికళ అనే ఆమెని తీసుకువచ్చారన్నారు. వివేకా హత్య జరిగిన చోట దొరికిన లేఖను నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎందుకు దాచారని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డికి తండ్రిలా వివేకా సహాయం చేశారని గుర్తుచేశారు. శివశంకర్ రెడ్డి అరెస్ట్ చేస్తే అవినాష్ రెడ్డి ఎందుకు వెళ్లకూడదని నిలదీశారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి (Bhaskar Reddy)వైపు కేసును తీసుకెళుతున్నారని విమర్శించారు. వైఎస్సార్ (YSR)పై ఫ్యాక్షన్ ముద్ర వేశారని... జగన్‌పై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. వివేకా హత్య కేసులో న్యాయం జరగాలని... కుట్రదారులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. అసలైన హంతకులకు కఠిన శిక్ష పడాలన్నారు. వివేక హత్య కేసులో అవినాష్ అరెస్ట్ అంటూ ప్రచారం చేస్తున్నారని... అవినాష్ అరెస్ట్ జరిగితే అంతకంటే ఘోరం లేదని అన్నారు. సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా జరగాలి అని కోరుకుంటున్నామని తెలిపారు. చంద్రబాబు ఇలాంటి అంశాల చుట్టూ రాజకీయం చేయడం దురదృష్టకరమని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారు.