Ganta Srinivasa Rao: టీడీపీ - జనసేన పార్టీలు కలిసి కట్టుగా పోరాడాలి
ABN , First Publish Date - 2023-10-31T13:01:33+05:30 IST
టీడీపీ - జనసేన (TDP - Jana Sena ) పార్టీలు కలిసి కట్టుగా పోరాడాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasa Rao ) వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం: టీడీపీ - జనసేన (TDP - Jana Sena ) పార్టీలు కలిసి కట్టుగా పోరాడాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasa Rao ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు విశాఖపట్నంలో టీడీపీ జనసేన పార్టీలు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ..‘‘ఇది టీడీపీ - జనసేన పార్టీ ఉమ్మడి తొలి సమావేశం. ఈ సమావేశం జరుగుతుండగానే మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ నేత నారా చంద్రబాబు నాయుడుకి బెయిల్ రావడం సంతోషంగా ఉంది. 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి, బెయిల్ మీద ఉన్న వ్యక్తి సీఎం జగన్. జగన్ పాలనకు చమర గీతం పాడాలి. వైసీపీని గద్దె దింపేందుకు టీడీపీ - జనసేన కృషి చేయాలి. టీడీపీ - జనసేన కలిసి కట్టుగా పోరాడాలి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకోవాలి. టీడీపీ - జనసేన పార్టీల ఈ సమావేశం వచ్చే ఎన్నికల్లో భారీ విజయానికి నాంది పలుకుతుంది’’ అని గంటా శ్రీనివాసరావు అన్నారు.