Share News

Ganta Srinivasa Rao: తుఫాన్‌తో రైతులు నష్ట పోయి రోడ్డున పడ్డారు

ABN , First Publish Date - 2023-12-06T20:18:52+05:30 IST

వాతావరణ శాఖ మిచౌంగ్ తుఫాన్‌ ( Michoung Typhoon )పై అప్రమత్తం చేసిన వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సరైన చర్యలు తీసుకోలేదని ఎక్స్ వేదికగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasa Rao ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ganta Srinivasa Rao: తుఫాన్‌తో రైతులు నష్ట పోయి రోడ్డున పడ్డారు

విశాఖపట్నం: వాతావరణ శాఖ మిచౌంగ్ తుఫాన్‌ ( Michoung Typhoon )పై అప్రమత్తం చేసిన వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సరైన చర్యలు తీసుకోలేదని ఎక్స్ వేదికగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasa Rao ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘మన రాష్ట్రం మిచౌంగ్ తుఫాను ప్రభావంతో వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.. రైతులు రోడ్డున పడ్డారు. అయ్యా జగన్ గారు ఎక్కడున్నారు.. ఏమి చేస్తున్నారు అని ప్రజలు వాపోతున్నారు.తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇకనైనా బయటకు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. మిచౌంగ్ తుఫాన్ బాధిత ప్రజలకు తక్షణ సహాయం చేయడంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది. ప్రకృతి విపత్తులకు పరిహారం నాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన సాయం - నేడు జగన్ గారి సాయంకు మధ్య వ్యత్యాసం మీరే గమనించండి.. రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి’’ అని గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.

Updated Date - 2023-12-06T20:19:05+05:30 IST