Viral news: కానిస్టేబుల్ కక్కుర్తి.. జిరాక్స్ పేపర్ల కోసం వెళ్లిన ఈ పోలీసు చివరకు ఏం చేశాడో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-04-07T16:17:38+05:30 IST
ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు.. కొన్నిసార్లు మరీ రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. కొందరైతే మరీ దారుణంగా వ్యవహరిస్తుంటారు. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించే వారు కొందరైతే.. మరికొందరు కాసుల కోసం కక్కుర్తి పనులు చేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి..
ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు.. కొన్నిసార్లు మరీ రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. కొందరైతే మరీ దారుణంగా వ్యవహరిస్తుంటారు. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించే వారు కొందరైతే.. మరికొందరు కాసుల కోసం కక్కుర్తి పనులు చేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలాంటి పోలీసులకు సంబంధించిన వార్తలు ఇట్టే వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ కానిస్టేబుల్ చేసిన పని చూసి అంతా ఛీకొడుతున్నారు. చిల్లర అడిగిన పాపానికి చివరకు ఆ పోలీసు ఏం చేశాడంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మెయిన్‌పురిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ జన సేవా కేంద్రంలో ఓ యువకుడు సమన్వయకర్తగా పని చేస్తున్నాడు. ఇదిలావుండగా బుధవారం కేంద్రంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. పలువురు స్థానికులు జన సేవా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వచ్చి వెళ్తూ ఉన్నారు. అదే సమయంలో స్థానికంగా పని చేసే ఓ కానిస్టేబుల్.. కేంద్రానికి వచ్చాడు. అంతకు ముందే జన సేవ కేంద్రంలో ఉన్న పేపర్లను ఇవ్వమని అక్కడున్న యువకుడిని అడిగాడు. దీంతో అతను కూడా వెంటనే లోపల ఉన్న పేపర్లను తీసి కానిస్టేబుల్‌కి ఇచ్చాడు.
అనంతరం జిరాక్స్ చేసిన పేపర్లకు (xerox papers) డబ్బులు ఇవ్వండి సార్.. అంటూ పోలీసును అడిగాడు. దీంతో సదరు పోలీసుకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. ‘‘ ఏంట్రా.. నన్నే డబ్బులు అడుగుతావా.. ఎంత ధైర్యం నీకు’’.. అంటూ దాడి (Police attack on young man) చేశాడు. వద్దు సార్.. కొట్టొద్దు.. అని యువకుడు అడ్డుకుంటున్నా వినకుండా మరింత రెచ్చిపోయాడు. మొఖంపై చేతులతో పదే పదే కొట్టడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అతను పోలీసు కావడంతో ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. యువకుడిపై దాడి చేసిన అనంతరం తన పేపర్లను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అయితే ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీ కెమెరాల్లో (CC cameras) రికార్డు అయింది. వీడియో వైరల్ అవడంతో పోలీసు ఉన్నతాధికారుల (Police officers) దృష్టికి వెళ్లింది. దాడి ఘటనపై విచారణ చేస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. సదరు కానిస్టేబుల్ దోషి అని తేలితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, యువకుడిపై దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో (Viral photos and videos) వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పోలీసులను కఠినంగా శిక్షించాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.