Viral Video: వామ్మో.. వీడి తెలివిని చూసి కస్టమ్స్ అధికారులే నివ్వెరపోయారు.. బంగారాన్ని దేనిలో దాచి మరీ దొరికిపోయాడంటే..!
ABN , First Publish Date - 2023-04-06T20:11:53+05:30 IST
విదేశాల నుంచి స్వదేశానికి వచ్చే క్రమంలో చాలా మంది అక్రమ రవాణాకు పాల్పడుతూ అధికారులకు దొరికిపోవడం తరచూ చూస్తూనే ఉంటాం. ప్రధానంగా బంగారు అక్రమ రవాణా కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తుంటాయి. కొందరు..
విదేశాల నుంచి స్వదేశానికి వచ్చే క్రమంలో చాలా మంది అక్రమ రవాణాకు పాల్పడుతూ అధికారులకు దొరికిపోవడం తరచూ చూస్తూనే ఉంటాం. ప్రధానంగా బంగారు అక్రమ రవాణా కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తుంటాయి. కొందరు బంగారాన్ని తరలించే పద్ధతిని చూసి చివరకు అధికారులే నివ్వెరపోతుంటారు. పొట్టలో, తొడ భాగాల్లో బంగారాన్ని అక్రమంగా తరలించే (Gold smuggling) వారిని చూశాం.. కానీ ప్రస్తుతం ఓ వ్యక్తి చేసిన నిర్వాకం చూసి అధికారులే షాక్ అయ్యారు. ఇంతకీ ఇతను బంగారాన్ని దేనిలో దాచి మరీ దొరికిపోయాడంటే..
సోషల్ మీడియాలో బంగారు అక్రమ రవాణాకు సంబంధించిన వార్త వైరల్‌గా (Viral news) మారింది. కస్టమ్స్ డ్యూటీ (Customs duty) నుంచి బయటపడేందుకు చాలా మంది విలువైన వస్తువులను విచిత్రమైన ప్రదేశాలు, వస్తువుల్లో ఉంచి తీసుకొస్తుంటారు. చివరకు అధికారులకు దొరికిపోయి.. అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇటీవల ఓ వ్యక్తి అబుదాబి నుంచి చెన్నైకి (Abu Dhabi to Chennai) వస్తూ ఇలాంటి పనే చేశాడు. ఏప్రిల్ 3న చెన్నై ఎయిర్‌పోర్టులో (Chennai Airport) రోజూ మాదిరే కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తిపై అనుమానం వచ్చి తనిఖీ చేశారు.
అయితే పైకి చూసేందుకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేకున్నా.. అధికారులకు మాత్రం అతడిపై అనుమానం కలిగింది. చివరకు అతడి వద్ద ఉన్న వస్తువులన్నింటినీ పరిశీలించారు. అందులో ఓ ఎలక్ట్రిక్ మోటారును (Electric motor) అనుమనాస్పదంగా కనిపించడంతో క్షణ్ణంగా పరిశీలించారు. చివరకు దాన్ని పగులగొట్టి చూడగా.. 1.796 కిలోల బంగారం బయటపడింది. పట్టుబడిన బంగారం విలువ రూ.95.15లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అధికారులు మోటారును పగులగొట్టి, బంగారు వెలికితీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.