Viral News: చేతులకు సంకెళ్లు వేసి మరీ నదిలోకి వదిలేస్తే.. నీళ్లలో మునిగిపోయి చావడం ఖాయమనుకుంటున్నారా..? కానీ..!
ABN , First Publish Date - 2023-04-06T19:00:39+05:30 IST
చాలా మంది అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటారు.. కానీ అందుకోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయరు. అయితే కొందరు మాత్రం అనుకున్నది సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. వేషధారణలో భిన్నంగా ఆలోచించేవారు కొందరైతే.. మరికొందరు..
చాలా మంది అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటారు.. కానీ అందుకోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయరు. అయితే కొందరు మాత్రం అనుకున్నది సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. వేషధారణలో భిన్నంగా ఆలోచించేవారు కొందరైతే.. మరికొందరు రకరకాల విన్యాసాలు చేసి రికార్డులు నెలకొల్పుతుంటారు. ఇలాంటి వారి సాహసాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదవడం చూస్తుంటాం. ప్రస్తుతం ఇలాంటి వ్యక్తికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చేతులకు సంకెళ్లు వేసి మరీ నదిలోకి తోసేశారు. నీళ్లలో మునిగిపోయి చావడం ఖాయం అని అంతా అనుకున్నారు. అయితే చివరకు ఏం జరిగిందంటే..
ఈజిప్ట్‌కు చెందిన షెహబ్ అలం అనే 31ఏళ్ల వ్యక్తి.. అరుదైన సాహసం చేశాడు. అరేబియా గల్ఫ్‌లోని (Arabian Gulf) ఓపెన్ వాటర్‌లో షెహబ్ ఆలం ఈ ఫీట్ చేశాడు. ముందుగా అతడి చేతికి సంకెళ్లు వేసి నీటిలో పడేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ (Guinness Book of World Records) అధికారులు పక్కనే పడవల్లో వెళ్తూ పర్యవేక్షించారు. సంకెళ్లు వేసిన చేతులు, కాళ్ల సాయంతో అలాగే ఈదుకుంటూ (Swimming with handcuffs) వెళ్లిన ఆలం.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ 11 కిలోమీటర్ల మేర ఈత కొట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.
గతంలో ఇలాంటి రికార్డు అమెరికా స్విమ్మర్ (American swimmer) బెంజమిన్ కాట్జ్‌మన్ పేరుతో ఉండేది. 2021లో ఇతడు చేతులకు సంకెళ్లు వేసుకుని.. 8.6 కిలోమీటర్ల ఈత కొట్టాడు. ప్రస్తుతం షెహబ్ అలం ఆ బద్దలుకొట్టాడు. ఈ సందర్భంగా ఆలం మాట్లాడుతూ చేతులకు సంకెళ్లు ధరించి ఈత కొట్టడం కష్టమైన పని అని చెప్పాడు. మొదట్లో బాగా ఇబ్బంది పడ్డట్లు తెలిపాడు. అయితే రోజూ సాధన చేయడం ద్వారా ఇది సాధ్యమైనట్లు పేర్కొన్నాడు. కాగా, చేతులకు సంకెళ్లు ధరించి ఈత కొట్టిన షెహబ్ అలం ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో (Viral photos and videos) వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆలంను అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.