Wife: రూ.20 వేలు పెట్టి భార్యకు మొబైల్ కొనిచ్చిన భర్త.. వేరే సిటీకి పనికెళ్లాక ఫోన్ చేస్తోంటే నో రెస్పాన్స్.. పక్కింటోళ్లకు కాల్ చేస్తే..!
ABN , First Publish Date - 2023-11-02T20:37:15+05:30 IST
భర్త తన భార్య, పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకునేందుకు ఊరు విడిచి వెళ్లి కష్టపడి పని చేస్తున్నాడు. అనుకున్నట్లుగానే బాగా సంపాదిస్తూ వారిని సంతోషంగా చూసుకునేవాడు. ఈ క్రమంలో భార్య పదే పదే అడగడంతో రూ.20లు ఖర్చు చేసి స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. రోజూ..
భర్త తన భార్య, పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకునేందుకు ఊరు విడిచి వెళ్లి కష్టపడి పని చేస్తున్నాడు. అనుకున్నట్లుగానే బాగా సంపాదిస్తూ వారిని సంతోషంగా చూసుకునేవాడు. ఈ క్రమంలో భార్య పదే పదే అడగడంతో రూ.20లు ఖర్చు చేసి స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. రోజూ భార్యా, పిల్లలతో వీడియో కాల్స్ చేసేవాడు. అయితే ఓ రోజు ఫోన్ చేయగా భార్య నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా స్విచ్చాఫ్ వస్తుండడంతో పక్కింటోళ్లకు ఫోన్ చేశాడు. చివరకు వారు చెప్పిన మాట విని షాక్ అయ్యాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బీహార్లోని (Bihar) బంకా జిల్లా అమర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త జీవనోపాధి నిమిత్తం నేపాల్ (Nepal) వెళ్లాడు. అక్కడే కూలి పనులు చేస్తూ.. అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం అతను నేపాల్ నుంచి ఇంటికి వచ్చాడు. అయితే ఆ సమయంలో అతడి భార్య (wife) .. తనకు స్మార్ట్ ఫోన్ (Smart phone) కొనివ్వాలని కోరింది. భార్య పదే పదే అడుగుతుండడంతో కాదనలేక చివరకు ఆమెకు రూ.20వేల విలువ చేసే ఫోన్ కొనిచ్చాడు. కొన్ని రోజులు భార్య, పిల్లలతో సంతోషంగా గడిపిన తర్వాత తిరిగి నేపాల్ వెళ్లిపోయాడు.
నేపాల్ వెళ్లాక రోజూ వీడియో కాల్స్ చేసుకుంటూ భార్య, పిల్లలతో మాట్లాడుతూ ఉండేవాడు. అయితే అక్కడికి వెళ్లిన కొన్ని రోజులకే ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ రోజు భార్యకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా అలాగే వస్తుండడంతో అనుమానం వచ్చి పక్కింటి వారికి ఫోన్ చేశాడు. ‘‘మీ భార్య తన ప్రియుడితో (boyfriend) కలిసి పారిపోయింది’’.. అని వారు చెప్పడంతో భర్త షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. వారి పిల్లలు ముగ్గురూ 2 నుంచి 6 ఏళ్ల వయసు వారే కావడంతో వారి ఆలనాపాలనా బాధ్యతలన్నీ అతనే చూసుకుంటున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.