Shocking: ఆ కుటుంబంపై పగబట్టిన మృత్యువు.. ఇప్పటికే ముగ్గురి మృతి.. మరొకరి పరిస్థితి విషమం.. ఇంతకీ అసలేం జరిగిందంటే..!
ABN , First Publish Date - 2023-11-02T19:01:41+05:30 IST
ఉన్న ఒక్కగానొక్క కొడుకు అనారోగ్యానికి గురయ్యాడు. ఎలాగైనా కొడుకును కాపాడుకోవాలని తండ్రి శతవిధాలా ప్రయత్నించాడు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కొడుకు అతడికి దక్కలేదు. కొడుకు ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రికి.. అంతలోనే మరో పిడుగులాంటి వార్త తెలిసింది. కూతురు..
ఉన్న ఒక్కగానొక్క కొడుకు అనారోగ్యానికి గురయ్యాడు. ఎలాగైనా కొడుకును కాపాడుకోవాలని తండ్రి శతవిధాలా ప్రయత్నించాడు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కొడుకు అతడికి దక్కలేదు. కొడుకు ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రికి.. అంతలోనే మరో పిడుగులాంటి వార్త తెలిసింది. కూతురు కూడా అస్వస్థతకు గురవడాన్ని తట్టుకోలేకపోయాడు. పాపనైనా కాపాడుకోవాలని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే కూతురు కూడా కళ్ల ముందే కానరానిలోకాలకు చేరుకుంది. ఇలా ఒకే కుటంబంలో ముగ్గురు మృతచెందడంతో గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. ఇంతకీ అసలేం జరిగిందంటే..
హర్యానాలోని (Haryana) నుమ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని చహల్కాకిధాని గ్రామంలో నివాసం ఉంటున్న సాహూన్ అనే వ్యక్తికి ఆలీషా (7), అద్నాన్ (4) అనే పిల్లలు ఉన్నారు. అక్టోబర్ 19న సాయంత్రం వీరి కుటుంబంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సాహూన్ కుమారుడు అద్నాన్కు ఉన్నట్టుండి వాంతులు మొదలయ్యాయి. దీంతో బాలుడిని చికిత్స నిమిత్తం తవడులోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే పిల్లాడి పరిస్థితి విషమంగా ఉండడంతో భివాడికి రెఫర్ చేశారు. అక్కడి నుంచి మళ్లీ ఆల్వార్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ (boy died of illness) అక్టోబర్ 20న మృతి చెందాడు. కొడుకు మృతదేహంతో గ్రామానికి చేరుకున్న తండ్రి.. తన కూతురికి కూడా వాంతులు అవడం చూసి ఆందోళన చెందాడు. వెంటనే పాపను కూడా నల్హర్‌లోని ఆస్పత్రికి తరలించారు.
Crime: ఇలాంటి కొడుకు ఉంటేనేం.. లేకుంటేనేం..? ఈ యువకుడు కన్న తల్లిని ఎందుకు చంపాడో తెలిస్తే..!
అయితే పాప పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్‌పై ఉంచాలని వైద్యులు సూచించారు. అయితే అక్కడ వెంటిలేటర్ ఖాళీగా లేకపోవడంతో అలాగే ఉంచారు. ఈ క్రమంలో చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన జరిగిన వెంటనే సాహూన్ మేనల్లుడు నాజీష్ (4).. కూడా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని కూడా ఫరీదాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారని తెలియడంతో గ్రామంలో ఆందోళన మొదలైంది. గ్రామంలో చాలా మంది ఆరోగ్యం దెబ్బతింటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఆరోగ్య కేంద్ర ఉన్నా.. ఏనాడూ వైద్య సిబ్బంది గ్రామంలోకి రాలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.