Hotel Room: ఓ గదిలోంచి తీవ్ర దుర్వాసన.. భరించలేక మారు తాళంతో తలుపులు తీసిన హోటల్ సిబ్బంది.. లోపలికి వెళ్లి చూస్తే..!
ABN , First Publish Date - 2023-07-25T19:49:31+05:30 IST
దంపతుల మధ్య తలెత్తే చిన్న చిన్న సమస్యలు కొన్నిసార్లు చిలికిచిలికి గాలివానలా మారుతుంటాయి. ఈ క్రమంలో చాలా మంది సంచలన నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దంపతుల విషయంలో ఇలాగే జరిగింది. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో..
దంపతుల మధ్య తలెత్తే చిన్న చిన్న సమస్యలు కొన్నిసార్లు చిలికిచిలికి గాలివానలా మారుతుంటాయి. ఈ క్రమంలో చాలా మంది సంచలన నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దంపతుల విషయంలో ఇలాగే జరిగింది. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం హోటల్లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. అయితే రెండు రోజుల తర్వాత.. లోపలి నుంచి దుర్వాసన వస్తుండడంతో సిబ్బంది మారు తాళంతో తలుపులు తీశారు. లోపలికి వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్ కనిపించింది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్‌లోని భన్వర్కవాన్ పోలీస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి అమర్ ప్యాలెస్ కాలనీ ప్రాంతానికి చెందిన రాహుల్ వర్మ అనే యువకుడు, ఇదే ప్రాంతానికి చెందిన నందినీ సోలంకి అనే యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు. ఇన్నాళ్లూ దంపతుల (couple) మధ్య ఎలాంటి గొడవలూ లేవు. ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఏమో గానీ.. బయటికి మాత్రం సంతోషంగా కనిపించేవారు. ఇలావుండగా, రెండు రోజుల క్రితం వీరిద్దరూ భన్వర్కవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హోటల్లో గదిని (hotel room) అద్దెకు తీసుకున్నారు. రెండు రోజుల సమయం దాటినా గదిని ఖాళీ చేయలేదు.
దీంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి వెళ్లి తలుపు తట్టారు. అయినా లోపలి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో చిరవకు వారి వద్ద ఉన్న మరో తాళం చెవితో తలుపు తీశారు. లోపలికి వెళ్లి చూస్తే.. భర్త ఫ్యాన్ ఉరికి వేలాడుతూ, భార్య మంచంపై విగతజీవిగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్యకు విషం ఇచ్చిన తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. నిందినీ నిత్యం రాహుల్ వేధిస్తూ ఉండేవాడని ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతుల ఫోన్ నంబర్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.