Success Story: ఈ అమ్మాయి మాట్లాడిన ఇంగ్లీషును విని నవ్వినోళ్లే.. ఇప్పుడు ఆమె ఏ స్థాయిలో ఉందో తెలిసి షాక్..!
ABN , First Publish Date - 2023-09-29T18:41:29+05:30 IST
పది మందిలో ఇంగ్లీష్ మాట్లాడేందుకు కొందరు తెగ భయపడిపోతుంటారు. ఎక్కడ తప్పులు దొర్లుతాయో, ఎవరూ నవ్వుతారో అనే భయంతో ఇంగ్లీష్ వచ్చినా మిన్నకుండిపోతుంటారు. అయితే కొందరు మాత్రం నవ్వినోళ్లకు చివరకు షాక్ ఇస్తూ.. తాము ఎంచుకున్న రంగంలో...
పది మందిలో ఇంగ్లీష్ మాట్లాడేందుకు కొందరు తెగ భయపడిపోతుంటారు. ఎక్కడ తప్పులు దొర్లుతాయో, ఎవరూ నవ్వుతారో అనే భయంతో ఇంగ్లీష్ వచ్చినా మిన్నకుండిపోతుంటారు. అయితే కొందరు మాత్రం నవ్వినోళ్లకు చివరకు షాక్ ఇస్తూ.. తాము ఎంచుకున్న రంగంలో దూసుకుపోతుంటారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే యువతి కూడా ఈ కోవకే చెందుతుంది. ఈ అమ్మాయి మాట్లాడిన ఇంగ్లీషును విని ఒకప్పుడు అంతా నవ్వుకునేవారు. అయితే చివరకు వాళ్లే ఆమె సక్సెస్ చూసి షాక్ అవుతున్నారు. ఈమె గురించి తెలుసుకున్న వారంతా ‘‘అసలైన సక్సెస్ అంటే ఇదే కదా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ (UPSC) పరీక్షలో విజయం సాధించడం అంత ఈజీ కాదు. కానీ మధ్యప్రదేశ్‌కు (Madhya Pradesh) చెందిన సురభి గౌతం అనే యువతి.. ఐఏఎస్ ఆఫీసర్ (IAS Officer) కావాలన్న తన లక్ష్యాన్ని మొదటి ప్రయత్నంలోనే ఛేదించిది. మధ్యప్రదేశ్ సత్నా జిల్లాలోని అమ్దారా గ్రామానికి చెందిన సురభి గౌతమ్.. తన పాఠశాల విద్యను గ్రామంలోనే పూర్తి చేసింది. సుభవి గౌతమ్ తండ్రి సివిల్ కోర్టులో న్యాయవాది (Civil Court Advocate) కాగా.. తల్లి ఉపాధ్యాయురాలుగా పని చేస్తుండేది. సురభి చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండేది.
ఈ క్రమంలో 10, 12 తరగతి పరీక్షల్లో ఆమె ఉత్తమ ప్రతిభ కనబరచి స్టేట్ మెరిట్ లిస్ట్‌లో స్థానం సంపాదించుకుంది. దీంతో పాటూ ఎలాంటి ట్యూషన్‌కి వెళ్లకుండానే అన్ని రకాల పోటీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధిస్తూ వచ్చింది. పాఠశాల విద్య అనంతరం భోపాల్‌లో ఇంజనీరింగ్ (Electronics and Communications) పూర్తి చేసింది. యూనివర్శిటీలో ఉత్తమ ప్రతిభ కనబరచినందుకు గాను గోల్డ్ మెడల్ అందుకుంది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన వెంటనే కాలేజీ ప్లేస్‌మెంట్ ద్వారా TCSలో ఉద్యోగం సంపాదించింది, కానీ సివిల్ సర్వీసెస్ లక్ష్యం కారణంగా మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. అనంతర కాలంలో సురభి.. ఇస్రో, బార్క్, జీటీఈ, ఎంపీపీఎస్‌సీ, సెయిల్, ఎఫ్‌సీఐ, ఎస్‌ఎస్‌సీ, ఢిల్లీ పోలీస్ తదితర పోటీ పరీక్షలకూ ఎంపికైంది.
సురభి గౌతమ్ చిన్నప్పటి నుంచి హిందీ మీడియం కావడంతో పాటూ గ్రామంలోనే పెరగడంతో ఇంగ్లీష్‌లో అంత పట్టు ఉండేది కాదు. దీనివల్ల ఇంగ్లీష్ మాట్లాడే సమయంలో పాఠశాలలో అందరూ ఎగతాళి చేసేవారు. దీంతో మొదట్లో బాధపడ్డా క్రమక్రమంగా తనకి తాను సర్దిచెప్పుకొంది. ఎలాగైనా ఇంగ్లీష్‌పై పట్టు సాధించడంతో పాటూ ఐఏఎస్ ఆఫీసర్ కావాలనే లక్షాన్ని నిర్ధేశించుకుంది. అప్పటి నుంచి అకుంటిత దీక్షతో చదవడం ప్రారంభించింది. ప్రతి రోజూ 10 కొత్త ఇంగ్లీష్ పదాలను నేర్చుకుంటూ వచ్చింది. ఇలా కొంత కాలానికి ఇంగ్లీష్‌పై పూర్తి పట్టు సాధించింది. ఇక ఆమె రెండో ఆశయమైన సివిల్ సర్వీస్‌పై మరింత దృష్టి సారించింది. ఈ క్రమంలో 2013లో ఐఈఎస్ (Indian Engineering Services) సర్వీసెస్‌కు ఎంపికై ఈ పరీక్షలో అఖిల భారత స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. అనంతరం 2016లో మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీస్ పరీక్షలో ఆల్ ఇండియా స్థాయిలో 50వ ర్యాంక్ సాధించి.. ఐఏఎస్ అధికారి కావాలన్న తన కలను సాకారం చేసుకుంది.