Brother: సడన్‌గా బైక్‌ను ఆపి చెల్లి గొంతు కోసిన అన్న.. బతికుండగానే పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి.. అసలు కథేంటంటే..!
ABN , First Publish Date - 2023-09-29T15:41:11+05:30 IST
కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి. ప్రధానంగా పరువు ప్రతిష్టలు, పంతాలకు పోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో కొందరు కన్న కొడుకు, కూతురు అని కూడా చూడకుండా దారుణాలకు తెగబడుతుంటారు. తాజాగా..
కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి. ప్రధానంగా పరువు ప్రతిష్టలు, పంతాలకు పోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో కొందరు కన్న కొడుకు, కూతురు అని కూడా చూడకుండా దారుణాలకు తెగబడుతుంటారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. బైక్‌లో వెళ్తున్న ఓ వ్యక్తి సడన్‌గా బండి ఆపి.. చెల్లెలి గొంతు కోశాడు. తల్లి అయితే బతికుండగానే కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) హాపూర్ జిల్లా గార్‌నగర్ పరిధిలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక గ్రామానికి చెందిన ఓ బాలికకు (girl), అదే గ్రామానికి చెందిన యువకుడికి కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరి ప్రేమ (love) మొదలైంది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే తిడతారనే భయంతో బాలిక దాచిపెట్టింది. తరచూ ప్రియుడిని కలుస్తూ ఉండేది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఉన్నట్టుండి ఆమె అనారోగ్యానికి గురైంది. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ల వద్ద చూపించేవారు. అయితే రోజులు గడుస్తున్నా ఆమె కోలుకోకపోవడంతో చివరకు తల్లీ, సోదరుడు కలిసి గురువారం బాలికను బైకుపై గార్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ పరీక్షలు చేయగా.. ఆమె గర్భవతి (pregnant) అని తెలిసింది. ఈ వార్త వినగానే తల్లి, సోదరుడు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బయట తెలిస్తే తమ పరువు పోతుందనే ఉద్దేశంతో చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. బాలికను ఇంటికి తీసుకెళ్లే క్రమంలో నిర్మానుష్య ప్రదేశంలో బైకు ఆపిన అన్న.. బ్లేడుతో చెల్లెలి గొంతు కోశాడు. తర్వాత ఆమెపై తల్లి పెట్రోల్ పోసి నిప్పంటించింది. తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు గమనించి మంటలు ఆర్పేసి ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతరం మీరట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.