Shocking Video: సముద్రం ఒడ్డున చెప్పులు లేకుండా నడిస్తే.. ఎంత ప్రమాదమో మీరే చూడండి.. ఇసుక లోపల ఇలాంటి జీవులా..?
ABN , First Publish Date - 2023-09-28T19:33:54+05:30 IST
సాయంత్ర సమయంలో సముద్ర తీరంలో సేద తీరితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉరుకుపరుగుల జీవితంలో చాలా మంది కాస్త వీలు చిక్కితే విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటుంటారు. ఇలాంటి సమయంలో చాలా మంది సముద్ర తీరాన్ని ఒక్కసారైనా..
సాయంత్ర సమయంలో సముద్ర తీరంలో సేద తీరితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉరుకుపరుగుల జీవితంలో చాలా మంది కాస్త వీలు చిక్కితే విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటుంటారు. ఇలాంటి సమయంలో చాలా మంది సముద్ర తీరాన్ని ఒక్కసారైనా విధిగా సందర్శిస్తుంటారు. సముద్రం ఒడ్డున చెప్పులు పక్కన పడేసి పరుగులు పెడుతూ, నీటిలో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇలా చెప్పులు లేకుండా నడిచే వారు ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ వీడియో చూసిన వారంతా ఇసులో లోపల ఇలాంటి జీవులు కూడా ఉంటాయా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి యుతిలో చేపను పట్టుకుని సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్తాడు. ఓ చోట ఆగి నీళ్లలో చేపను అటూ, ఇటూ తిప్పి ఓ చోట నేలపై పెడతాడు. మరో చేత్తో ఇనుప కట్టర్ పట్టుకుని ఇసుకలో నుంచి ఏదో వస్తువును పైకి తీసేందుకు ప్రయత్నిస్తాడు. ఏదో వింత వస్తువును బయటికి తీస్తున్నాడేమో అని అంతా అనుకుంటారు. కానీ లోపలి నుంచి బయటికి వచ్చిన పురుగు (beach worms) తలను పట్టుకుని గట్టిగా బయటికి లాగేస్తాడు.
తీరా చూస్తే పొడవాటి పురుగు బయటికి వస్తుంది. బతికున్న ఆ పురుగు ఇసుకలో కూరుకుపోయి ఉన్నా ఎలా బతికి ఉండడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఇదేం విచిత్రం’’.. అని కొందరు, ‘‘ఇసుకలో ఇలాంటి పురుగులు కూడా ఉంటాయా’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి పురుగును ఎక్కడా చూల్లేదు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 23లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.