Viral Video: కరెంట్ షాక్‌తో నీళ్లలో గిలాగిలా కొట్టుకుంటున్న చిన్నారిని చూసి.. అంతా భయపడి పారిపోతుంటే.. చివరకు..

ABN , First Publish Date - 2023-09-28T21:46:59+05:30 IST

కష్ట సమయాల్లో ఎవరైనా సాయం చేసిన సందర్భంలో.. ‘‘సమయానికి దేవుడిలా వచ్చారు’’.. అని అంటూ ఉంటాం. కొన్నిసార్లు ప్రాణం పోతుందనుకున్న సమయంలో అద్భుతాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఆశ్చర్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు..

Viral Video: కరెంట్ షాక్‌తో నీళ్లలో గిలాగిలా కొట్టుకుంటున్న చిన్నారిని చూసి.. అంతా భయపడి పారిపోతుంటే.. చివరకు..

కష్ట సమయాల్లో ఎవరైనా సాయం చేసిన సందర్భంలో.. ‘‘సమయానికి దేవుడిలా వచ్చారు’’.. అని అంటూ ఉంటాం. కొన్నిసార్లు ప్రాణం పోతుందనుకున్న సమయంలో అద్భుతాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఆశ్చర్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ చిన్నారి విద్యుదాఘాతానికి గురై కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. దీంతో అంతా భయపడి దూరంగా పారిపోయారు. అయితే ఓ వృద్ధుడు ముందుకొచ్చి చివరకు ఏం చేశాడంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) వారణాసి చేత్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధి హబీబ్‌పురాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వర్షం కురవడంతో ఈ ప్రాంతంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో ఓ పిల్లాడు రోడ్డుపై వెళ్తుండగా.. సడన్‌గా (Boy electrocuted) విద్యుదాఘాతానికి గురవుతాడు. దీంతో రోడ్డు పక్కన నీటిలో పడిపోయి గిలాగిలా కొట్టుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఓ ఆటో అటుగా వస్తుంది. చిన్నారిని చూసి వాహనాన్ని ఆపిన వారు కాపాడే ప్రయత్నం చేస్తారు. వారిలో ఓ వ్యక్తి కాపాడుతుండగా అతడికీ షాక్ కొడుతుంది. దీంతో వెంటనే అతను అప్రమత్తమై పక్కకు వెళ్లిపోతాడు. మరోవైపు పిల్లాడేమో.. ఏడుస్తూ విలవిల్లాడిపోతుంటాడు. కరెంట్ షాక్ కొడుతుందనే భయంతో ఎవరూ దగ్గరికి వెళ్లే సాహసం చేయరు.

Viral Video: ఆకాశంలో అద్భుత దృశ్యం.. గాల్లో ఉండగానే విమానం టైరును మార్చేందుకు ఓ మహిళ సాహసం.. సరిగ్గా వందేళ్ల క్రితం..!

ఇలాంటి సమయంలో ఓ పెద్దాయన ధైర్యం చేసి దగ్గరికి వెళ్తాడు. అయితే చేత్తో తాకకుండా ఓ పెద్ద కర్ర తీసుకుని పిల్లాడికి తాకిస్తాడు. దీంతో చిన్నారి ఆ కర్రను గట్టిగా పట్టుకుంటాడు. అలా పట్టుకోగానే వృద్ధుడు (old man saved electrocuted boy) అతన్ని పక్కకు లాగేస్తాడు. దీంతో ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడతాడు. ఆ సమయంలో పెద్దాయన రాకుండా ఉండుంటే పిల్లాడి ప్రాణాలు ప్రమాదంలో పడేవి. సమయానికి స్పందించి చిన్నారి ప్రాణాలు కాపాడిన ఆయన్ను.. అక్కడున్న వారంతా అభినందనలతో ముంచెత్తారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘సమయానికి దేవుడిలా వచ్చాడు’’.. అని కొందరు, ‘‘అంత మంది చూస్తున్నారే గానీ.. ఎవరికీ ఈ ఆలోచన రాలేదు’’.. అని మరికొందరు, ‘‘మీరు సూపర్ తాత’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Shocking Video: సముద్రం ఒడ్డున చెప్పులు లేకుండా నడిస్తే.. ఎంత ప్రమాదమో మీరే చూడండి.. ఇసుక లోపల ఇలాంటి జీవులా..?

Updated Date - 2023-09-28T21:46:59+05:30 IST