Viral Video: ఆకాశంలో అద్భుత దృశ్యం.. గాల్లో ఉండగానే విమానం టైరును మార్చేందుకు ఓ మహిళ సాహసం.. సరిగ్గా వందేళ్ల క్రితం..!

ABN , First Publish Date - 2023-09-28T20:37:37+05:30 IST

మనిషి గుండెను తీసి మరో మనిషి గుండెను అమర్చే వెసులుబాటు ఉన్న ప్రస్తుత టెక్నాలజీ యుగంలో.. గాల్లో విమానాల టైర్లను మార్చడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ అదే వందేళ్ల క్రితం.. ఇలాంటి పని ఊహకందని కష్టమనే చెప్పొచ్చు. కానీ అలాంటి అసాధ్యాన్ని అదీ ఓ మహిళ...

Viral Video: ఆకాశంలో అద్భుత దృశ్యం.. గాల్లో ఉండగానే విమానం టైరును మార్చేందుకు ఓ మహిళ సాహసం.. సరిగ్గా వందేళ్ల క్రితం..!

మనిషి గుండెను తీసి మరో మనిషి గుండెను అమర్చే వెసులుబాటు ఉన్న ప్రస్తుత టెక్నాలజీ యుగంలో.. గాల్లో విమానాల టైర్లను మార్చడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ అదే వందేళ్ల క్రితం.. ఇలాంటి పని ఊహకందని కష్టమనే చెప్పొచ్చు. కానీ అలాంటి అసాధ్యాన్ని అదీ ఓ మహిళ సుసాధ్యం చేసిందంటే ఆశ్చర్యం కలగకమానదు. విమానం గాల్లో ఉండగానే ఓ మహిళ టైరును ఈజీగా మార్చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. యూఎస్ లాస్ ఏంజిల్స్ (US Los Angeles) పరిధిలో 1920లో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్లాడిస్ ఇంగిల్ అనే మహిళ.. ప్రమాదంలో ఉన్న విమానాన్ని సురక్షితంగా కిందకు దించడంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది. శిక్షణ విమానం గాల్లో ఉండగా.. దానికి ఉన్న ఓ టైరు ప్రమాదవశాత్తు ఊడిపోయింది. దీంతో విమానం కిందకు దిగే అవకాశం లేకుండా పోయింది. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న అధికారులు.. ఇలాంటి విషయాల్లో శిక్షణ పొందిన గ్లాడిస్ ఇంగిల్‌ను రంగంలోకి దించారు. వెంటనే అప్రమత్తమైన ఆమె ఓ టైరును భుజానికి తగిలించుకుని విమానం రెక్కలపై నిల్చుని గాల్లోకి వెళ్లింది. ఆ విమానం రెక్కల పైకి వెళ్లి.. చివరకు ప్రమాదానికి గురైన విమానం మీదకు ఎక్కింది. తర్వాత ఆ విమానం కింద భాగానికి చేరుకుని టైరు వద్ద కూర్చుంది.

Shocking Video: సముద్రం ఒడ్డున చెప్పులు లేకుండా నడిస్తే.. ఎంత ప్రమాదమో మీరే చూడండి.. ఇసుక లోపల ఇలాంటి జీవులా..?

ఆపై తన వద్ద ఉన్న టైరును ఊడిపోయిన (woman who changed plane tire in air) ప్రాంతంలో ఏర్పాటు చేసింది. దీంతో చివరకు ఆ విమానం క్షేమంగా నేలపై ల్యాండ్ అయింది. వేల అడుగుల ఎత్తులో ఏమాత్రం భయం లేకుండా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి విమానంలోని వారి ప్రాణాలు కాపాడిన మహిళను అంతా అభినందనలతో ముంచెత్తారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా మహిళను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘‘ఈ మహిళ ధైర్య సాహసాలు అమోఘం’’.. అని కొందరు, ‘‘అప్పట్లోనే ఇలాంటి సాహసం చేయడం చాలా గ్రేట్’’.. అని మరికొందరు, ‘‘చూస్తుంటేనే భయంగా ఉంది.. కానీ ఈమె ఎంత ఈజీగా చేసేసింది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Tagore Movie Scene: ఠాగూర్ సినిమాను ఈ అమెరికా డాక్టర్లు చూశారేమో.. 65 ఏళ్ల మహిళ బతికే ఉందంటూ నాటకం.. చివరకు..!

Updated Date - 2023-09-28T20:37:37+05:30 IST