Bandi Sanjay: ప్రధాని విద్యాభ్యాసంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-04T13:55:26+05:30 IST

ప్రధానమంత్రి మోదీ చదువుపై పనిలేని వాళ్ళే అనవసర చర్చ పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు.

Bandi Sanjay: ప్రధాని విద్యాభ్యాసంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) చదువుపై పనిలేని వాళ్ళే అనవసర చర్చ పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) విమర్శించారు. చదువుకు.. పదవులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. టాప్ లీడర్‌గా ప్రపంచమే నరేంద్ర మోదీ (PM Nodi)ని గుర్తించిందని చెప్పుకొచ్చారు. ఈనెల 8న మోదీ సభ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్స్‌ను బీజేపీ నేతలు (BJP Leaders) పరిశీలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు డబ్బులు పెట్టుబడి పెట్టేస్థాయికి కేసీఆర్ (CM KCR) ఎలా వచ్చాడో చెప్పాలని ప్రశ్నించారు. నందినగర్ ఇంట్లో ఉన్నప్పుడు బ్యాంక్‌లోన్లు కట్టలేని కేసీఆర్‌కు వేల కోట్లు ఎక్కడివని నిలదీశారు. విద్యార్థుల ఉసురు పోసుకుంటోన్న కేటీఆర్‌ (Minister KTR) ను క్యాబినెట్ నుంచి బయటకు పంపాలన్నారు. హైదరాబాద్‌లో లక్షలాది మందితో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు. పదో తరగతి హిందీ పేపర్ కూడా లీక్ అవ్వటం సిగ్గుచేటని మండిపడ్డారు.

80 వేల పుస్తకాలు చదివిన ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM) ఫాంహౌస్‌లో పడుకున్నారని యెద్దేవా చేశారు. కేసీఆర్ కొడుకు, కూతురు చదివిన చదువు లిక్కర్ దందా, డ్రగ్స్ దందా చేయమని చెప్పిందా అంటూ నిలదీశారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన‌ ఘనత కేసీఆర్ దే అని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ (BRS) అంటే అంతర్జాతీయ దొంగల పార్టీ అని అన్నారు. గతంలో అపార్ట్‌మెంట్‌లో ఉన్న కవిత (BRS MLC Kavitha)కు.. ఇల్లు లేని‌ కేటీఆర్‌కు వేల కోట్లు, బంగళాలు ఎక్కడవన్నారు. కాళేశ్వరం దగ్గర నుంచి కేసీఆర్ ప్రభుత్వంలో అన్నీ లీక్ లే అని వ్యాఖ్యలు చేశారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ప్రధాని మోదీ సభకు లక్షలాది మందిగా తరలిరావాలని ప్రజలు, బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Updated Date - 2023-04-04T13:55:26+05:30 IST