Share News

Venkataprasad: 55 రోజుల్లో రెండోసారి పెన్షన్ పంపిణీతో ప్రజల్లో ఆనందం...

ABN , Publish Date - Aug 01 , 2024 | 10:40 AM

Andhrapradesh: గతంలో మాట తప్పను అని ప్రగల్భాలు పలికిన వైఎస్ జగన్ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు సమయం తీసుకున్నారని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లను అందజేస్తున్న ఘనత చంద్రబాబుదే అని చెప్పుకొచ్చారు.

Venkataprasad: 55 రోజుల్లో రెండోసారి పెన్షన్ పంపిణీతో ప్రజల్లో ఆనందం...
MLA Kandikunta Venkata Prasad

శ్రీ సత్యసాయి జిల్లా, ఆగస్టు 1: గతంలో మాట తప్పను అని ప్రగల్భాలు పలికిన వైఎస్ జగన్ (YSRCP Chief YS Jagan) వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు సమయం తీసుకున్నారని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ (MLA Kandikunta Venkata Prasad) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లను అందజేస్తున్న ఘనత చంద్రబాబుదే (CM Chandrababu Naidu) అని చెప్పుకొచ్చారు. ప్రజల మధ్య పండగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

LPG Cylinder Price: బ్యాడ్ న్యూస్.. పెరిగిన సిలిండర్ ధర



పేదల కోసం పరితపిస్తున్న సీఎం చంద్రబాబు అని అన్నారు. లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం ప్రస్ఫుటంగా కనబడుతోందన్నారు. ఎన్టీఆర్ భరోసా చరిత్రలో నిలవబోతున్నదని తెలిపారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు ప్రభుత్వం మనోధైర్యం కల్పిస్తోందన్నారు. 55 రోజుల్లో రెండోసారి పెన్షన్ పంపిణీతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. చంద్రబాబు వస్తేనే రాష్ట్రంలో పరిపాలన బావుంటుందని ప్రజలు గ్రహించారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. వందకు వంద శాతం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. సంక్షేమం,అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ పేర్కొన్నారు.


పెన్షన్ల పండుగ...

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సందడిగా మొదలైంది. తెల్లవారుజాము నుంచి పెన్షన్ల పంపిణీ షురూ అయ్యింది. ఎమ్మెల్యేలు, అధికారులు స్వయంగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొత్తూరులో పింఛన్లను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పంపిణీ చేశారు. దేవరపల్లి మండలం లో నీ దుద్దుకూరు బందపురం చిన్నాయిగూడెం గ్రామాల్లో అరగంట ఆలస్యంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. ఆలస్యంగా పెన్షన్లు పంపిణీ ప్రారంభించిన సచివాలయ ఉద్యోగులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి, షోకాజ్ నోటీసులు అందజేస్తామని దేవరపల్లి ఎంపీడీవో తెలియజేశారు.

Madanapalle Incident: సీఐడీకి మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదం కేసు



అటు విశాఖ జిల్లాలో పింఛ‌న్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. జిల్లాలో 1,63, 210 మందికి..70.05 కోట్లు పంపిణీ చేశారు. పెన్షన్ల పంపిణీ కోసం 4,398 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఈ రోజు, రేపటి కల్లా పింఛ‌న్లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందు వలన పెన్షన్ల పంపిణీకి ప్రజాప్రతినిధులు దూరమయ్యారు. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా వేకువజాము నుంచి పింఛన్లను సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో అధికారులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా రూ.329.44 కోట్లు పంపిణి చేయనున్నారు.


కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని పలు వార్డ్‌లలో ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లను ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి పంపిణీ చేశారు. జగన్ ఐదేళ్లు అధికారంలో ఉండి లక్షల కోట్లు విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టేశారన్నారు. కూటమి ప్రభుత్వం లో సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చి ప్రజల్లో ఆనందం నింపుతారని ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి తెలిపారు. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే డా. పాశిం సునీల్ కుమార్ పంపిణీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఉదయం 6.00 గంటల నుంచేఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

Vizag Steel Plant: చిక్కుల్లోనే విశాఖ ఉక్కు!

Free Sand Policy: ఇసుకలో ఎందుకీ గందరగోళం?

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 01 , 2024 | 10:44 AM