AP Politics: వైసీపీలో ఓటమి భయం.. సోషల్ మీడియాలో కారుకూతలు..!
ABN , Publish Date - Mar 21 , 2024 | 05:16 PM
AP Elections 2024: రానున్న ఎన్నికల్లో ఓడిపోబోతున్నామనే భయంతో వైసీపీ(YSRCP) మూకలు రెచ్చిపోతున్నాయి. సోషల్ మీడియా(Social Media) వేదికగా తమ పైశాచిక ఆనందాన్ని ప్రదర్శిస్తున్నాయి. బీజేపీ(BJP), టీడీపీ(TDP) లక్ష్యంగా దుష్ప్రచారం ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికగా ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.
AP Elections 2024: రానున్న ఎన్నికల్లో ఓడిపోబోతున్నామనే భయంతో వైసీపీ(YSRCP) మూకలు రెచ్చిపోతున్నాయి. సోషల్ మీడియా(Social Media) వేదికగా తమ పైశాచిక ఆనందాన్ని ప్రదర్శిస్తున్నాయి. బీజేపీ(BJP), టీడీపీ(TDP) లక్ష్యంగా దుష్ప్రచారం ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికగా ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. వైసీపీకి చెందిన సోషల్ మీడియా మాధ్యమాల్లో ‘చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చిన బీజేపీ. దెబ్బకు లిస్ట్ వాయిదా’ అంటూ పోస్ట్ పెట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో కుమ్మక్కయి ఓడిపోయే సీట్లను బీజేపీకి చంద్రబాబు ఇచ్చారంటూ ప్రచారం చేస్తున్నారు. దీనికి ఎదురు తిరిగిన ఓరిజినల్ బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలకు ఘాటుగా లేఖలు రాసారని పోస్ట్‌లో పేర్కొన్నారు. సీట్ల పంచాయితీ తేలేవరకూ టీడీపీ ఎంపీల జాబితా వెల్లడించొద్దని చంద్రబాబు బీజేపీ అల్టిమేటం ఇచ్చిందని పోస్ట్‌లో పేర్కొన్నారు.
అంతేకాదు.. ‘నోటికొచ్చనట్టు మోడీ, అమిత్ షాను తిట్టావు. బీజేపీతో గేమ్ ఇలానే ఉంటుంది బాబు.’ అంటూ అడ్డమైన పోస్టులన్నీ పెట్టి.. ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, వైసీపీ అధికారిక సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్టులపై.. టీడీపీ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నారు. వారి పోస్టులను ధీటుగా తిప్పికొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఓటమి తథ్యం అని తేలడంతోనే ఆఖరి ప్రయత్నంగా సోషల్ మీడియాలో కూటమిపై విషప్రచారం చేస్తోందంటూ మండిపడుతున్నారు.