Share News

Nadendla Manohar: జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది

ABN , Publish Date - Oct 22 , 2024 | 06:47 PM

ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అప్పగించిన 48 గంటల్లోపు రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మొదటి రకం ధాన్యానికి మద్దతు ధర రూ. 2,350లకు కొంటామని తెలిపారు. రైతులకు నచ్చిన రైస్ మిల్లులో ధాన్యాన్ని రైతులు అమ్ముకోవచ్చుని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Nadendla Manohar: జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది

ఏలూరు: జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గత ఐదు సంవత్సరాలు వ్యవస్థలను వ్యక్తిగత అవసరాలకు, వారి స్వలాభం కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. రూ. 1674 కోట్లు బకాయిలు రైతులకు వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదని మండిపడ్డారు. ఇవాళ(మంగళవారం) ఏలూరులో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు,


ALSO READ: Nara Lokesh: వంగవీటి రాధా నారా లోకేష్ భేటీ..కారణమిదే.

ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ... రూ. 13 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లిపోయారని ఆరోపించారు. ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అప్పగించిన 48 గంటల్లోపు రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని స్పష్టం చేశారు. మొదటి రకం ధాన్యానికి మద్దతు ధర రూ. 2350లకు కొంటామని తెలిపారు. రైతులకు నచ్చిన రైస్ మిల్లులో ధాన్యాన్ని అమ్ముకోవచ్చని వెల్లడించారు. గోనెసంచులు హమాలి ట్రాన్స్‌పో‌ర్ట్ ప్రభుత్వమే భరించి రైతుల ఖాతాలో డబ్బులు వేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.


వైసీపీ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలి: ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి

Somireddy-Chandramohan.jpg

ఉమ్మడి నెల్లూరు: వైసీపీ నేతలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి హెచ్చరించారు. చిల్లకూరు మండలం నాంచారం పేటలో వైసీపీ వర్గీయులు టీడీపీ కార్యకర్త మల్లారపు హరిప్రసాద్‌పై దాడి చేసి హత్య చేశారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీలో ఉన్న హరిప్రసాద్ మృతదేహాన్ని గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చిన వారిలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గం టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఉన్నారు.


మృతుని కుటుంబ సభ్యులకు టీడీపీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి మాట్లాడుతూ... వైసీపీ మూకలు టీడీపీ కార్యకర్త హరిప్రసాద్‌పై బీరు బాటిళ్లతో పెట్రోల్ పోసి, దాడి చేసి దారుణంగా హత్య చేయడం దారుణమని అన్నారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌ను మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్లు సర్వనాశనం చేసి ప్యాలెస్‌లో శాంతి వచనాలు చెబుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు శాంతియుతగా ఉండాలని చెప్పడంతో టీడీపీ శ్రేణులు మౌనంగా ఉన్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Minister Nara Lokesh: మెటాతో ఎంవోయూ ఒక మైలురాయి

AP Ministers: మూడు రోజులుగా ఢిల్లీలోనే ఏపీ మంత్రులు.. ఎందుకంటే

Gottipati Ravikumar: ఏ సీఎం చేయని పనులు జగన్ చేశారు.. మంత్రి గొట్టిపాటి ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 22 , 2024 | 06:52 PM