AP Elections: వైసీపీకి వచ్చే సీట్లపై క్లారిటీ.. అంతర్గత సర్వేల్లో తేలింది ఇదేనా!
ABN , Publish Date - Apr 27 , 2024 | 08:19 PM
ఏపీలో రెండోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో జగన్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు విపక్ష కూటమిని బలహీనర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు, కుట్రలు ఫలించకపోవడంతో జగన్‌తో పాటు వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు వచ్చిన ఓపీనియన్ పోల్స్‌లో సైతం వైసీపీకి సానుకూలంగా లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు నిరాశ చెందారు.
ఏపీలో రెండోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో జగన్ తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు విపక్ష కూటమిని బలహీనర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు, కుట్రలు ఫలించకపోవడంతో జగన్‌తో పాటు వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు వచ్చిన ఓపీనియన్ పోల్స్‌లో సైతం వైసీపీకి సానుకూలంగా లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు నిరాశ చెందారు.
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తమకు అనుకూలంగా మారతాయని భావించారు. జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రతో వైసీపీ బలం పెరుగుతుందని అంచనా వేశారు. వైసీపీ గెలుపు వ్యూహాలు అన్ని విఫలమవుతూ వస్తుండటంతో.. ఏం చేయాలో ఆ పార్టీ నేతలకు అర్థంకావట్లేదట. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి రోజురోజుకు బలం పెరుగుతుందనే వార్తలు వస్తుండటం వైసీపీకి కంటిపై కునుకు లేకుండా చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.
YSRCP Manifesto 2024: మళ్లీ గెలిస్తే.. అమ్మ ఒడి పెంపు: సీఎం జగన్
అంతర్గత సర్వేల్లో ఏం తేలిందంటే..?
గత నెల రోజుల వ్యవధిలో వైసీపీ రెండు నుంచి మూడు సార్లు సర్వే చేయించినట్లు తెలుస్తోంది. మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభానికి ముందు.. బస్సు యాత్ర ముగిసిన తర్వాత సర్వే నిర్వహించగా.. ప్రజాభిప్రాయం వైసీపీకి వ్యతిరేకంగా వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బస్సు యాత్ర ప్రారంభానికి ముందు 50 నుంచి 60 సీట్లు గెలవచ్చని అంతర్గత సర్వేలో తేలగా.. తాజాగా బస్సు యాత్ర ముగిసిన తర్వాత నిర్వహించిన పార్టీ సర్వేలో 50 సీట్లు దాటడం కష్టమని తేలిందట. దీంతో వైసీపీ అధినేత జగన్‌లో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. అంతర్గత సర్వేలో వచ్చిన ఫలితాలు వైసీపీ నేతలను కలవరపెడుతున్నాయనే చర్చ జరగుతోంది.
రాయలసీమ జిల్లాలో మినహా మిగతా చోట్ల వైసీపీకి వాతావరణం అనుకూలంగా లేనట్లు తేలిందట. రాయలసీమ జిల్లాల్లోనూ అనంతపురం, కర్నూలు, చిత్తూరులో కూడా తెలుగుదేశం పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని, వైసీపీకి వచ్చే సీట్లలో ఉమ్మడి రాయలసీమ జిల్లాలోనే ఎక్కువుగా ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
జగన్‌పైనే తీవ్ర వ్యతిరేకత..
వైసీపీ నిర్వహించిన అంతర్గత సర్వేలో ప్రజలు జగన్ పనితీరుపైనే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తేలిందట. స్థానిక వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు జగన్ ఐదేళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగా లేరని, ముఖ్యంగా సంక్షేమ పథకాలు మినహిస్తే.. రాష్ట్ర అభివృద్ధి విషయంలో జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎక్కువమంది అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. వృద్ధులు, మహిళలు జగన్ సంక్షేమ పథకాలపై కొంత సంతృప్తితో ఉన్నప్పటికీ.. యువత, ఉద్యోగస్తులు, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఓటర్లు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు అంతర్గత సర్వేలో తేలిందట. ప్రజల్లో వైసీపీ పట్ల అసంతృప్తి ఎన్నికల వరకు ఇలాగే ఉంటుందా.. అసలు ఫలితాలు ఎలా ఉంటాయనేది జూన్4న తేలిపోనుంది.
AP Elections: వైసీపీ మేనిఫెస్టో: నాడు - నేడు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh and Telugu News Here