AP Elections: పంపకాలు ప్రారంభం.. కండీషన్స్ అప్లై..!
ABN , Publish Date - May 09 , 2024 | 02:07 PM
ఓట్ల పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది పార్టీల ప్రచారం, రాజకీయ పార్టీల మధ్య విమర్శలు.. ఎక్కడ చూసినా పార్టీ జెండాలు.. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్ది అభ్యర్థుల్లో టెన్షన్.. వీటన్నింటికి తోడు చివరి రెండు రోజులు అంటే పంపకాల సమయం.. ఇటీవల కాలంలో ఓటుకు నోట్ల పంపిణీ ఎక్కువైపోయింది. కావాలని ఓటర్లు అడగకపోయినా.. డబ్బులిస్తే ఓట్లు వేస్తారనే ఆశతో ప్రధాన పార్టీలు డబ్బుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నాయి.
ఓట్ల పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది పార్టీల ప్రచారం, రాజకీయ పార్టీల మధ్య విమర్శలు.. ఎక్కడ చూసినా పార్టీ జెండాలు.. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్ది అభ్యర్థుల్లో టెన్షన్.. వీటన్నింటికి తోడు చివరి రెండు రోజులు అంటే పంపకాల సమయం.. ఇటీవల కాలంలో ఓటుకు నోట్ల పంపిణీ ఎక్కువైపోయింది. కావాలని ఓటర్లు అడగకపోయినా.. డబ్బులిస్తే ఓట్లు వేస్తారనే ఆశతో ప్రధాన పార్టీలు డబ్బుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నాయి. పంచాయతీ ఎన్నికల మొదలు లోక్‌సభ (Lok Sabha) వరకు ఎన్నిక ఏదైనా పైసల పంపిణీ తప్పనిసరిగా మారిపోయింది. నోటు తీసుకుని ఓటు వేయడం నేరమని ఎన్నికల సంఘం (Election Comission) ప్రచారం చేస్తున్నా.. వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు నోట్ల పంపిణీ జరిగేది. ప్రస్తుతం పోలింగ్‌కు నాలుగైదు రోజుల ముందే పంపకాలను ప్రారంభించేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఓట్లకు నోట్ల పంపిణీ ప్రారంభమైందనే ప్రచారం జరుగుతోంది. ఓ పార్టీకి సంబంధించి నియోజకవర్గాలవారీ రేట్ ఫిక్స్ చేసి పంపిణీ ప్రారంభించారని, ప్రత్యర్థి పార్టీలు ఎక్కవ ఇస్తే చివరి రోజు రెండో విడతగా మరో వంద రూపాయిలు పెంచి పంపిణీ చేయవచ్చనే ప్లాన్‌లో పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది.
AP News: జగన్ చెప్పింది చేయరు.. చేసేది చెప్పరు: కనకమేడల
నియోజకవర్గాల వారీ..
రాష్ట్రంలో 175 శాసనసభా స్థానాలు ఉన్నాయి. వీటిలో రిజర్వుడ్ స్థానాల్లో రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు పంపిణీ చేయాలని ఓ పార్టీ నిర్ణయించిందట. ముందు వెయ్యి పంపిణీ చేయాలని, ప్రత్యర్థి పార్టీ వెయ్యికి మించి ఇస్తే రెండో విడతలో మరో రూ.500 పంపిణీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పోటీ ఎక్కువుగా ఉన్న రిజర్వుడు స్థానాల్లో అవసరమైతే రూ.2వేలు పంచడానికి అధికారంలో ఉన్న ఓ పార్టీ ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది ఉదాహరణకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, పి.గన్నవరం స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థి రూ.1500 నుంచి రూ.2,000 వరకు పంపకాలు ప్రారంభినట్లు తెలుస్తోంది. ఇక జనరల్ స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు ఓటుకు రూ.2వేల చొప్పున పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. పోటీ ఎక్కువుగా ఉందనుకున్న నియోజకవర్గాల్లో రూ.3వేలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో అధికార పార్టీ ఓటుకు రూ.5వేల వరకు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
దూర ప్రాంతాల్లో ఉంటే..
ఓటర్లు దూర ప్రాంతంలో ఉంటే వారికి ప్రయాణ ఖర్చులు భరించేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారట. ఏపీలో అధికారపార్టీకి చెందిన అభ్యర్థులు హైదరాబాద్‌లో ఉన్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. బస్సులోనే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసి, తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకునేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరో పార్టీ అభ్యర్థులు పొరుగూరు నుంచి వచ్చేవారికి బస్సు ఛార్జీలు చెల్లించడంతో పాటు.. హైదరాబాద్ నుంచి వచ్చే స్వగ్రామాలకు వచ్చే ఓటర్లకు రూ.1000 నుంచి రూ.1500 చొప్పున ప్రయాణ ఖర్చులు భరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రయాణం చేసిన టికెట్ చూపించి స్థానిక నాయకుల దగ్గర డబ్బులు తీసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
షరతులు ఇవే..
ఓట్లకు నోట్ల పంపిణీలో పార్టీలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓటరు స్లిప్పులు చూపించిన వాళ్లకు మాత్రమే డబ్బులు పంపిణీ చేయాలని నిర్ణయించాయి. ఓటరు స్లిప్పులు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇచ్చేదే లేదని స్థానిక నాయకులు చెబుతున్నారు. మరోవైపు దూరప్రాంతాల్లో ఉంటే ఓటు వేయడానికి వస్తేనే డబ్బులు ఇస్తామని షరతులు విధిస్తున్నారు. గతంలో ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో లెక్క చూసుకుని డబ్బులు ఇచ్చేవాళ్లు. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య పెరగడంతో బూతుకు వెళ్లి ఓటు వేస్తారనుకునేవాళ్లకే నోట్లు పంపిణీ చేయాలని అభ్యర్థులు స్థానిక క్యాడర్‌కు ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. మరోవైపు డబ్బులు ఎవరికి ఇవ్వాలి.. ఎవరికి ఇవ్వకూడదనే దానిపై జాబితాలను రెడీ చేశారట. డబ్బులిచ్చినా ఓట్లు పడవనుకునేవాళ్లకు ఇవ్వకూడదని, తటస్థంగా ఉన్నారనుకునేవాళ్లకు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీ సానుభూతి పరులందరికీ తప్పనిసరిగా ఇవ్వాలని అభ్యర్థులు క్యాడర్‌కు సూచించారట. ఇక నియోజకవర్గంలో కనీసం 75 శాతం ఓట్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నోట్లు ఓట్లు తెచ్చిపెడతాయా.. లేదా అనేది జూన్4న తేలనుంది.
CPI Narayana: ఊళ్లకు ఊళ్లే దోచేసిన.. ఇక రోజాను భరించే శక్తి నగరికి లేదు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News And Telugu News