AP Elections: చివరి రెండు రోజులు.. ఎవరి వ్యూహాలు వారివి..!
ABN , Publish Date - May 10 , 2024 | 09:39 AM
ఏపీలో పోలింగ్ టైమ్ దగ్గరపడింది. పొరుగూరు అంతా సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఊరు నుంచి వచ్చిన ఓటర్ల దగ్గరకు వెళ్లి పార్టీ శ్రేణులు పలకరిస్తున్నారు. ప్రయాణం ఎలా జరిగింది. అంతా కులాశానేనా.. పని ఎలా నడుస్తుంది. ఆరోగ్యం బాగుందా అంతా అప్యాయంగా పలకరిస్తూ.. చివరిలో మన గుర్తు మర్చిపోకు.. మన పార్టీకే ఓటు వేయాలంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు .
ఏపీలో పోలింగ్ టైమ్ దగ్గరపడింది. పొరుగూరు అంతా సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఊరు నుంచి వచ్చిన ఓటర్ల దగ్గరకు వెళ్లి పార్టీ శ్రేణులు పలకరిస్తున్నారు. ప్రయాణం ఎలా జరిగింది. అంతా కులాశానేనా.. పని ఎలా నడుస్తుంది. ఆరోగ్యం బాగుందా అంతా అప్యాయంగా పలకరిస్తూ.. చివరిలో మన గుర్తు మర్చిపోకు.. మన పార్టీకే ఓటు వేయాలంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు గ్రామాల్లో పార్టీ నాయకులు. ఇప్పటివరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తు.. చివరి రెండు రోజులు మరో ఎత్తు. సరిగా రెండు రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది. శనివారం ఆరుగంటలకు మైకులు మూగబోనున్నాయి. దీంతో స్థానిక పార్టీ నాయకులు మరోసారి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. పనిలో పనిగా ఓటర్లు కొంత మొత్తాన్ని ముట్టజెపుతున్నారు. చివరి రెండు రోజులు ఏదైనా జరగొచ్చు.. అందుకే పార్టీ నేతలంతా అలర్ట్‌గా ఉండాలని అధిష్టానం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో ప్రతి అభ్యర్థి క్షేత్రస్థాయిలోని ముఖ్య నాయకులతో సంప్రదిస్తూ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. సుమారు 30 గంటల సమయం మాత్రమే ప్రచారానికి మిగిలి ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు తమ తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
AP Elections 2024: తుది దశకు చేరుకున్న ఎన్నికల పోరు..
పక్కా వ్యూహం..
ఏపీలోని ప్రతి నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి అభ్యర్థికి, వైసీపీ అభ్యర్థికి మధ్య పోటీ నెలకొంది. ద్విముఖ పోరులో ఓటరు ఎవరువైపు మొగ్గుచూపుతున్నారనేది ఇప్పటికీ స్పష్టంకాలేదు. గతంలో ఓటరు నాడి ఎన్నికలకు వారం రోజుల ముందు బయటపడేది. ప్రస్తుతం కొంతమంది తమ మనసులో మాటను బయటపెడుతున్నా.. మరికొందరు బయటపడటం లేదు. దీంతో అభ్యర్థుల్లోనూ టెన్షన్ నెలకొంది. దీంతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల వారీగా ఓటర్లను విభజించి.. తమక పక్కాగా వచ్చే ఓట్లు.. పక్కాగా ప్రత్యర్థి పార్టీకి పడే ఓట్లను విభజించారు. తటస్థంగా ఉన్నారనుకున్నవాళ్లను టార్గెట్ చేస్తున్నారు.
ప్రత్యేక విందు..
గ్రామాల్లో తటస్థ ఓటర్లను ఎవరు ప్రభావితం చేస్తారో తెలుసుకుని.. ఆ వ్యక్తులను పిలిపించి ప్రత్యేక విందు ఏర్పాటుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఓట్లను తమకు పడేలా చేస్తే గెలిచిన తర్వాత నిన్ను చూసుకుంటాం అంటూ కొంతమంది అభ్యర్థులు హామీ ఇస్తున్నారట. ప్రస్తుతానికి వ్యక్తి సామర్థ్యాన్ని బట్టి ఖర్చులకు ఉంచమంటూ రూ.10 నుంచి రూ.20 వేల వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. చివరి రెండు రోజులు కావడంతో అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. ఓ వైపు పంపకాల కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూనే తమపై కొంత గుర్రుగా ఉన్నారనుకుంటున్న సామాజిక వర్గం పెద్దలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా అభ్యర్థులు గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. ఓటర్లు ఎవరిని కరుణిస్తారనేది జూన్4న తేలనుంది.
CPM(GS) Sitaram Yechury:ఎన్నికల తర్వాత దేశంలో పెనుమార్పులు!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News and Telugu News