Share News

Elections 2024: ఫేక్‌‌లతో జాగ్రత్త.. నమ్మారో.. అంతే సంగతులు..

ABN , Publish Date - Apr 28 , 2024 | 06:59 PM

ఇది అసలే ఎన్నికల సమయం.. ఓట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారివి. ప్రజలను నమ్మించేందుకు అనేక మార్గాలు.. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఫేక్ ప్రచారం ఎక్కువైంది. ఏది సత్యమో.. ఏది అసత్యమో తెలుసుకునేలోపు అబద్ధం అందరినీ చేరుకుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వచ్చాక.. సాంకేతికతను ఉపయోగించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అది ఫేక్ అని గ్రహించేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

Elections 2024: ఫేక్‌‌లతో జాగ్రత్త.. నమ్మారో.. అంతే సంగతులు..
Fake News

ఇది అసలే ఎన్నికల సమయం.. ఓట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారివి. ప్రజలను నమ్మించేందుకు అనేక మార్గాలు.. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఫేక్ ప్రచారం ఎక్కువైంది. ఏది సత్యమో.. ఏది అసత్యమో తెలుసుకునేలోపు అబద్ధం అందరినీ చేరుకుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వచ్చాక.. సాంకేతికతను ఉపయోగించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అది ఫేక్ అని గ్రహించేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.


ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో ప్రత్యర్థులపై బురద చల్లేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి చెందిన కొందరు సామాజిక మాద్యమాల్లో తప్పుడు సమాచారాన్ని పోస్టు చేస్తున్నారు. అలా చేయడం తప్పు అని తెలిసినా పార్టీ అధినాయకులు సైతం వాటినే ప్రోత్సహిస్తున్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వాళ్లపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవడానికి బదులు వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫేక్ పోస్టుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొంతమంది తప్పుడు పోస్టులను నిజమని నమ్ముతున్న సందర్భాలు లేకపోలేదు.

Sharmila: సీఎం జగన్.. లాయర్ పొన్నవోలు మధ్య క్విడ్ ప్రోకో


వెరీ డేంజర్..

పార్టీ అధినాయకుల ప్రశంసల కోసమో.. లేదా ప్రత్యర్థి పార్టీల నాయకులను ప్రజల్లో తక్కువ చేసేందుకు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తున్నారు. ప్రధానంగా నెల క్రితం పెన్షన్ల విషయంలో వైసీపీ నాయకులు సోషల్ మీడియా ద్వారా సృష్టించిన గందరగోళంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలు జారీచేసి ఫించన్లు అందజేయాలని ఆదేశిస్తే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల సామాజిక భద్రత పెన్షన్లను ఆపేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ వైసీపీ నాయకులు ప్రచారం చేశారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలోనూ ఫేక్ పోస్టులు పెట్టారు. ఆ తరువాత వాలంటీర్ల విషయంలోనూ తీవ్ర గందరగోళం సృష్టించారు.


వాలంటీర్ల గౌరవ వేతనాన్ని పెంచుతామని, వాలంటీర్ల విధానాన్ని కొనసాగిస్తామని టీడీపీ, జనసేన పార్టీలు చెప్పినా.. వైసీపీ నాయకులు మాత్రం టీడీపీ వస్తే వాలంటీర్లను తీసేస్తారంటూ అసత్య ప్రచారాన్ని చేశారు. తరువాత కొద్దిరోజులకు వాస్తవం అందరికీ తెలిసివచ్చింది.


ఈ 15 రోజులు..

పోలింగ్‌కు ఇంకా 15 రోజుల సమయం ఉంది. ఈ టైమ్‌లో ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు చాలా మంది సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే రిజర్వేషన్ల అంశంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ , బీజేపీ ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ పోస్టులు పెడుతున్నారు. వీటిలో కొన్ని తప్పుడు పోస్టులు ఉన్నాయని రెండు పార్టీలు ఖండిస్తున్నాయి. తాజాగా రిజర్వేషన్లను రద్దు చేస్తామనే అర్థం వచ్చేలా అమిత్‌షా మాట్లాడారంటూ ఓ వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇది డీప్ ఫేక్ వీడియో అని బీజేపీ ఖండించింది. ఇలా సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులపై మరో 15 రోజులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


AP Elections 2024: ఏపీ రాజకీయాలపై జయప్రద ఇంట్రస్టింగ్ కామెంట్స్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Apr 28 , 2024 | 06:59 PM