AP Elections 2024: అక్కడ గెలిస్తే మంత్రి పదవి కన్ఫామ్! అందరి దృష్టి ఆ సీటుపైనే..!
ABN , Publish Date - Apr 28 , 2024 | 11:10 AM
రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన మైలవరం నియోజకవర్గం మొదట్లో కమ్యునిస్టుల పాలనలో ఉండేది. అనంతరం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. టీడీపీ ఆవిర్భవించిన తరువాత తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే అందులో ఐదుసార్లు టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. చనమోలు వెంకట్రావు, వడ్డే శోభనాద్రీశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి ఉద్దండులు గెలిచిన నియోజకవర్గం ఇది.
రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన మైలవరం(Mylavaram) నియోజకవర్గం మొదట్లో కమ్యునిస్టుల పాలనలో ఉండేది. అనంతరం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. టీడీపీ(TDP) ఆవిర్భవించిన తరువాత తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే అందులో ఐదుసార్లు టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. చనమోలు వెంకట్రావు, వడ్డే శోభనాద్రీశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి ఉద్దండులు గెలిచిన నియోజకవర్గం ఇది.
వైసీపీ(YCP) ఆవిర్భావం తర్వాత గత ఎన్నికల్లో ప్రజలు ఫ్యాను పార్టీని గెలిపించారు. ఈ ఎన్నికల సమరంలో పంతానికి పోయిన వైసీపీ పెద్దలు సాదాసీదా జెడ్పీటీసీ సభ్యుడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి రాజకీయ జూదానికి తెరదీశారు. వైసీపీ నుంచి సర్నాల తిరుపతిరావు, టీడీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఆయన గెలిస్తే మంత్రి పదవి ఖాయమంటూ నియోజకవర్గంలో ఓ చర్చ నడుస్తోంది. – విజయవాడ – ఆంధ్రజ్యోతి/ మైలవరం/జి.కొండూరు.
వైసీపీ గ్రూపు రాజకీయాలు
నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం, విజయవాడ రూరల్ మండ లం కొంత భాగం (కొత్తూరు, పైడూరుపాడు, రాయనపాడు, తుమ్మలపాలెం, గొల్లపూడి, జక్కంపూడి) ఉన్నా యి. టీడీపీలో దేవినేని ఉమామహేశ్వరరావు తిరుగులేని నేతగా చలామణి అయ్యారు. వసంత కృష్ణ ప్ర సాద్ రాకతో ఇద్దరి నడుమ కొంత కాలం దూరం కొనసాగినా ఇప్పుడు ఇద్దరూ ఏకతాటిపై నడుస్తూ టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. మరోవైపు వైసీపీలో గ్రూపు రాజకీయాలు ఆ పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలుపొందిన వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి గు డ్‌బై చెప్పి ప్రస్తుతం టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. వైసీపీ అధినేత జగన్ టికెట్ ఇచ్చి, ఎన్నికల ఖర్చు భరిస్తానని చెప్పినా కాదని వసంత ఫ్యాను పార్టీకి గుడ్ బై చెప్పడంతో వైసీపీ అధినేత అహం దెబ్బతింది. దీంతో సాధారణ జెడ్పీటీసీని నిలబెట్టి వసంతను ఓడించాలన్న లక్ష్యంతో వైసీపీ అధినేత పావులు కదుపుతున్నారు.
పేద వ్యక్తికి పెత్తందారుకు నడుమ పోటీ జ రుగుతుందంటూ ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి సర్నాలకు అంగబలం, అర్ధబలం అన్నీ జగన్ సమకూరుస్తున్నారు. అలాంటప్పుడు ఎవరు పెత్తందారని టీ డీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా వ సంత ఉన్నా పెత్తనమంతా జోగి రమేశ్ సాగించార న్న ఆరోపణలున్నాయి. జోగి రమేశ్‌ది మైలవరం ని యోజకవర్గం. కానీ ఇక్కడ గెలవలేక ఆయన గత ఎ న్నికల్లో పెడన నుంచి పోటీ చేసి విజయం సాధించా రు. ప్రతిపక్ష నేతలపై బూతులతో దాడి చేయడం.. ప్రతిపక్ష నేత ఇంటిపై దాడికి తెగబడటం వంటి చర్యలతో అధినేత జగన్ మెప్పు పొంది మంత్రి పదవి ద క్కించుకున్నారు. గ్రావెల్ దోపిడీ, ఇసుక, బూడిద దోపిడీకి తెరదీశారు. తమ్ముడిని కొండపల్లి మున్సిపాలిటీ పీఠంపై కూర్చోబెట్టాలన్న ప్రయత్నాలు వసంత కారణంగా సాగలేదు. ఆ అక్కసుతో వసంత వర్గాన్ని ఐదే ళ్లూ వేధించారు. ఇవన్నీ తట్టుకోలేక.. నియోజకవర్గం లో అభివృద్ధి పనులకు నిధులు తేలేక వసంత వైసీపీ కి గుడ్‌బై చెప్పారు. ఆయన నిష్క్రమణతో మైలవరం లో జోగి వర్గానికి తిరుగులేకుండా పోయింది. అయితే సర్నాలకు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో ఇప్పుడు ఈ రెండు వర్గాల నడుమ ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇవన్నీ వైసీపీ ఓటమికి దారి తీయనున్నాయి.
మైలవరం ఓటర్ల తీర్పు విలక్షణం..
రాష్ట్రంలో ఓటర్లపరంగా అతిపెద్ద నియోజకవర్గాల్లో మైలవరం ఒకటి. ఇక్కడి ఓటర్ల తీర్పు విలక్షణంగా ఉంటుంది. 1955లో ఓటర్ల సంఖ్య 52,031 కాగా ప్రస్తు తం 2,81,732 మంది ఉన్నారు. అటు గ్రామీణం, ఇటు పట్టణ వాతావరణంలో ఉండే ఓటర్ల తీర్పు ఎప్పుడూ విలక్షణంగానే ఉంటుంది. 2009 డీలిమిటేషన్‌లో భాగంగా అప్పటి వరకు మైలవరం నియోజకవర్గంలోని ఎ.కొండూరు మండలాన్ని తిరువూరు నియోజకవర్గంలో కలిపారు. 2009, 2014లో దేవినేని ఉమా వరుసగా మైలవరంలో గెలుపొంది మైలవరాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చారు. అంతకు ముందు 1999లో ఉయ్యూరు నుంచి మైలవరం వలస వచ్చిన వడ్డే శోభనాద్రీశ్వరరావు సమర్థతను గుర్తించిన మైలవరం ఓటర్లు ఆయన్ని గెలిపించగా చంద్రబాబు ఆయన్ను మంత్రిని చేశారు. అలాగే 2009లో వచ్చిన దేవినేని ఉమాను 2సార్లు గెలిపించగా ఆయన్ను కూడా చంద్రబాబు మంత్రిని చేశారు. ఇలా వలస చేతలని చూడకుండా నియోజకవర్గానికి ఏం చేస్తాడని ఆలోచించి ఓటు వేసి విలక్షణ తీర్పు ఇస్తూ వస్తున్నారు.
ఇప్పటికే ముగ్గురికి మంత్రి పదవులు..
మైలవరం నియోజకవర్గం నుంచి గెలుపొందితే మంత్రి పదవి దక్కడం ఖాయమనే అభిప్రాయం ఇ క్కడి ఓటర్లలో బలంగా ఉంది. ఇందుకు ప్రధాన కార ణం ప్రధాన పార్టీల తరపున గెలుపొందిన నేతలు 5 సార్లు మంత్రి పదవులు పొందటమే. జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామానికి చెందిన దివంగత నేత చనమోలు వెంకట్రావ్ కాంగ్రెస్ తరుపున 5సార్లు గెలుపొంది 3 సార్లు మంత్రిగా పనిచేశారు. 1999లో వడ్డే శోభనాద్రీశ్వరరావు టీడీపీ తరుపున గెలుపొంది మంత్రిగా 2004 వరకు, 2014లో టీడీపీ తరుపున గెలుపొందిన దేవినేని ఉమా మంత్రిగా 2019 వరకు కొనసాగారు. ఈసారి ఎన్నికల్లో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టీడీపీ తరుపున గెలుపొంది రాష్ట్రంలో కూట మి అధికారంలోకి వస్తే తప్పకుండా చంద్రబాబు క్యా బినెట్‌లో మంత్రి పదవి దక్కించుకునే అవకాశాలు న్నట్టు వసంత సన్నితులంటున్నారు. నియోజకవర్గం లో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగ్గా 6 సార్లు కాంగ్రెస్, 5 సార్లు టీడీపీ, రెండు సార్లు సీపీఐ, ఒకసారి వైసీపీ గెలుపొందింది. ఇప్పుడు టీడీపీ, వైసీపీ తరుపున పోటీ నెలకొంది.
నియోజకవర్గం ప్రాధాన్యత..
మైలవరం నియోజకవర్గం విజయవాడ చెంతనే ఉంటుంది. విజయవాడ – హైదరాబాద్ జాతీయరహదారి పొడవునా విస్తరించి ఉండే ఈ నియోజకవర్గం పారిశ్రామికంగాను.. భౌగోళికంగాను ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రధానమైన నియోజకవర్గాల్లో ఒకటి. మైలవరంలో ఎన్నారై లకిరెడ్డి హనిమిరెడ్డి నిర్మించిన కోడిగుడ్డు మేడా ప్రత్యేక ఆకర్షణ. లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఇక్కడే ఉంది. ఇబ్రహీంపట్నంలో ఎన్టీపీఎస్ థర్మల్ విద్యుత్ కేంద్రం, కొండపల్లిలో ఏపీహెచ్‌ఎంఈఎల్ (అప్మెల్) ఉంది. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో, జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్ చమురు, గ్యాస్ సంస్థలు, బీపీసీఎల్ గ్యాస్ కంపెనీ, ఎన్‌సీఎల్ సిమెం ట్ ప్యాక్టరీ, లైట్ వెయిట్ బ్రిక్స్ కంపెనీలున్నాయి. జి. కొండూరులో గెయిల్ సంస్థ ఉంది. కొండపల్లిలో ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ ఏరియా (ఐడీఏ) ఉంది. ఇందులో సుమారు 300 వరకు పరిశ్రమలున్నాయి. కొండపల్లి ఖిల్లా ఎప్పటి నుంచో పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద గోదావరి కృష్ణాలో కలిసే ప్రాంతాన్ని పవిత్ర సంగమంగా నామకరణం చేసి పర్యాటక ప్రదేశంగా టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. మూలపాడు అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ స్పాట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేవినేని ఉమా మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టింది.అటు వ్యవసా యం రంగం, ఇటు పారిశ్రామిక రంగంలోనూ నియోజకవర్గంలో ఒక ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది.
మహిళా ఓటర్లే అధికం..
నియోజకవర్గంలో మహిళా ఓటర్లే అధికంగా ఉ న్నారు. మొత్తం 2,81,732 మంది ఓటర్లుండగా, వారి లో పురుషులు 1,36,740 మంది. కాగా మహిళలు 1,44,972 మంది. అంటే పురుషుల కంటే 8,232 మం ది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.
విజయవాడ తూర్పున విజేతలు వీరే :
సంవత్సరం - విజేత పార్టీ - సమీప ప్రత్యర్థి పార్టీ
1955 - వెల్లంకి విశ్వేశ్వరరావు, సీపీఐ - పెదర్ల వెంకట సుబ్బయ్య, కాంగ్రెస్
1962 - వెల్లంకి విశ్వేశ్వరరావు, సీపీఐ - పెదర్ల వెంకట సుబ్బయ్య, కాంగ్రెస్
1967 - చనమోలు వెంకట్రావు, కాంగ్రెస్ - వెల్లంకి విశ్వేశ్వరరావు, సీపీఐ
1972 - చనమోలు వెంకట్రావు, కాంగ్రెస్ - దగ్గుమల్లి మధుసూదనరావు, స్వతంత్ర
1978 - చనమోలు వెంకట్రావు రెడ్డి, కాంగ్రెస్ - టీఎస్ ఆనందబాయి, జనతా
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండుగా చీలిపోగా ఇందిరా కాంగ్రెస్ తరఫున జాన్ సుదర్శనం, రెడ్డి కాంగ్రెస్ తరఫున చనమోలు వెంకట్రావు పోటీ చేశారు.
1983 - నిమ్మగడ్డ సత్యనారాయణ, టీడీపీ - చనమోలు వెంకట్రావు, కాంగ్రెస్
1985 - చనమోలు వెంకట్రావు, కాంగ్రెస్ - నిమ్మగడ్డ సత్యనారాయణ, టీడీపీ
1989 - కోమటి భాస్కరరావు, కాంగ్రెస్ - జ్యేష్ఠ రమేశ్ బాబు, టీడీపీ
1994 - జ్యేష్ఠ రమేశ్ బాబు, టీడీపీ - చనమోలు వెంకట్రావు, కాంగ్రెస్
1999 - వడ్డే శోభనాద్రీశ్వరరావు, టీడీపీ - కోమటి సుధాకరరావు, కాంగ్రెస్
2004 - చనమోలు వెంకట్రావు, కాంగ్రెస్ - వడ్డే శోభనాద్రీశ్వరరావు, టీడీపీ
2009 - దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ - అప్పసాని సందీప్, కాంగ్రెస్
2014 - దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ - జోగి రమేశ్, వైసీపీ
2019 - వసంత కృష్ణ ప్రసాద్, వైసీపీ - దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ