AP Election Results: ఏపీ ఎన్నికల్లో నాలుగు గంటల్లోనే తొలి ఫలితం.. అదెక్కడంటే..?
ABN , Publish Date - May 28 , 2024 | 05:00 PM
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్ర ప్రజలంతా ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. జూన్4 ఎప్పుడు వస్తుందా అంటూ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ఏ నియోజకవర్గం ఫలితం ముందు వస్తుందనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడంతో ఓట్ల లెక్కింపు సులభతరమైంది.
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్ర ప్రజలంతా ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. జూన్4 ఎప్పుడు వస్తుందా అంటూ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ఏ నియోజకవర్గం ఫలితం ముందు వస్తుందనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడంతో ఓట్ల లెక్కింపు సులభతరమైంది. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓట్ల లెక్కింపునకు దాదాపు 2 రోజుల సమయం పట్టేది. ఈవీఎంలు వచ్చాక గంటల వ్యవధిలో ఎన్నికల ఫలితాలు తెలిసిపోతున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. తక్కువ పోలింగ్ బూత్‌లు ఉన్న దగ్గర, ఎక్కువ టేబుల్స్ ఏర్పాటు చేసిన నియోజకవర్గాల్లో ఫలితం త్వరగా వస్తుంది. ఈ లెక్క ప్రకారం ఉమ్మడి కృష్ణాజిల్లాలో తొలి ఫలితం నందిగామ, పామర్రు నుంచి వచ్చే అవకాశం ఉంది.
Nara Lokesh: రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేసిన మహానాయకుడు ఎన్టీఆర్
ఓట్ల లెక్కింపు ఇలా..
జూన్4వ తేదీ ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. గ్రామాలవారీ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నియోజకవర్గంలోని వరుస క్రమంలో బూత్‌లవారీ ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌ల సంఖ్యను ఆధారంగా ఓట్ల లెక్కింపు కోసం నిర్ది్ష్ట సంఖ్యలో టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఎక్కువ టేబుల్స్ ఏర్పాటుచేసిన చోట ఫలితం త్వరగా వెల్లడవుతుంది. తక్కువ టేబుళ్లు ఏర్పాటుచేస్తే ఫలితం రావడం ఆలస్యం అవుతుంది. ఒక్కో నియోజకవర్గానికి 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ఎక్కడైనా కౌంటింగ్ హాల్ చిన్నదిగా ఉంటే అక్కడ 10 టేబుళ్ల వరకు ఏర్పాటు చేస్తారు. ఇలాంటి చోట ఫలితం రావడానికి సాయంత్రం అవుతుంది. ఒక్కో రౌండ్‌లో 14 ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఇలా నియోజకవర్గంలోని బూత్‌ల సంఖ్య ఆధారంగా రౌండ్లవారీ కౌంటింగ్ జరుగుతుంది. ఏదైనా నియోజకవర్గంలో 140 బూత్‌లు ఉంటే ఒక్కో రౌండ్‌లో 14 ఈవీఎంలను లెక్కిస్తే 10 రౌండ్లు కౌటింగ్ జరుగుతుంది. ఎన్ని రౌండ్లు అనేవి నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.
ముందు ఆ నియోజకవర్గంలోనే..
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ, పామర్రు నియోజకవర్గాల ఫలితం కౌంటింగ్ ప్రారంభమైన 4 గంటల్లోనే వచ్చే అవకాశం ఉంది. అంటే మధ్యాహ్నం 12 గంటలకు తొలి ఫలితం వెలువడే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. తక్కువసంఖ్యలో అభ్యర్థులు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో ఫలితం త్వరగా వెలువడతాయి. నందిగామ నియోజకవర్గంలో 11మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండటంతో ఇక్కడి ఫలితం త్వరగా వచ్చే అవకాశం ఉంది. పామర్రులో 8 మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండటంతో ఈ నియోజకవర్గం ఫలితం మధ్యాహ్నం 12 గంటలలోపు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.
Perni Nani: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో నిబంధనల సడలింపుపై ఫిర్యాదు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..