AP Elections: వైసీపీ లెక్కలు తారుమారు.. ఆందోళనలో అభ్యర్థులు..
ABN , Publish Date - Apr 18 , 2024 | 11:02 AM
అనుకున్నదొకటి.. అయ్యిందొకటి అన్నట్లు ఉందట ఏపీలో వైసీపీ పరిస్థితి. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేది తామేనని, వందకు పైగా సీట్లు సాధిస్తామని ఎన్నికల షెడ్యూల్‌కు ముందు వైసీపీ (YSRCP) నాయకులు లెక్కలు వేశారు. గత ఎన్నికల్లో 151 సీట్లు రావడంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కారణంగా 50 సీట్లు తగ్గినా.. వంద సీట్లు వస్తాయని అంచనా వేశారట. అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే మాత్రం వైసీపీ నాయకులకు నిద్ర పట్టడంలేదనే చర్చ జరుగుతోంది.
అనుకున్నదొకటి.. అయ్యిందొకటి అన్నట్లు ఉందట ఏపీలో వైసీపీ పరిస్థితి. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేది తామేనని, వందకు పైగా సీట్లు సాధిస్తామని ఎన్నికల షెడ్యూల్‌కు ముందు వైసీపీ (YSRCP) నాయకులు లెక్కలు వేశారు. గత ఎన్నికల్లో 151 సీట్లు రావడంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కారణంగా 50 సీట్లు తగ్గినా.. వంద సీట్లు వస్తాయని అంచనా వేశారట. అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే మాత్రం వైసీపీ నాయకులకు నిద్ర పట్టడంలేదనే చర్చ జరుగుతోంది. గత ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని వైసీపీ చెప్పుకుంటోంది. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయనే విశ్వాసంలో ఆ నాయకులు ఉన్నారు. కానీ టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) పొత్తు పెట్టుకోవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. మరోవైపు టీడీపీ అభ్యర్థుల ఎంపిక తర్వాత వైసీపీలో గెలుపు ఆశలు వమ్ము అవుతూ వస్తున్నాయట. ప్రతి నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని పోటీలో పెట్టడంతో పాటు.. ప్రజల దృష్టిని ఆకర్షించడంలో కూటమి అభ్యర్థులు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ వేసుకున్న లెక్కలు తారుమరయ్యాయనే ప్రచారం జరుగుతోంది.
Loksabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ కీలక ఘట్టం
వెనకపడిన వైసీపీ
సంక్షేమ పథకాలు తప్పితే.. చెప్పుకోవడానికి అభివృద్ధి పనులు ఏమి లేకపోవడంతో ప్రచారంలో ఏం చెప్పాలో వైసీపీ నాయకులకు తెలియడం లేదట. ఎక్కడకు వెళ్లినా.. మా ప్రాంతానికి మీరు ఐదేళ్లలో చేసిందేమిటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఐదేళ్ల కాలంలో ఒక రోడ్డు వేయించలేకపోయారంటూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వైసీపీ నాయకులు కొన్ని ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లడంలేదట. సొంత పార్టీ నాయకులే కొన్ని నియోజకవర్గంలో కలిసిరావడంలేదనే చర్చ జరుగుతుంది.మరోవైపు స్థానిక ఎమ్మెల్యేలు తమను పట్టించుకోలేదని, తమపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని కొన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. వీళ్లంతా ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసే అవకాశం లేదనే ప్రచారం జోరందుకుంది. దీంతో వాలంటీర్ల ద్వారా స్థానిక ప్రజలను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వాలంటీర్లతో రాజీనామా చేయించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఒత్తిడి తెస్తున్నారు.
బెడిసికొడుతున్న వ్యూహం..?
ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై, స్థానిక నేతలపై ఉన్న వ్యతిరేకతను పొగొగట్టేందుకు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రను చేపట్టారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో కొంత వ్యతిరేకత తగ్గుతుందని వైసీపీ నేతలు అంచనా వేశారు. అయితే బస్సు యాత్రకు ఆశించిన స్థాయిలో స్పందన రావడంలేదట. దీంతో వైసీపీలో రోజురోజుకు ఆందోళన పెరుగుతున్నట్లు తెలుస్తోంది. 175 స్థానాల్లో గెలుస్తామంటూ మొదట్లో గట్టిగా చెప్పిన వైసీపీ నేతలు ప్రస్తుతం ఆ పదాన్నే ఉపయోగించడంలేదట. పోలింగ్‌కు మరో 25 రోజుల సమయం ఉంది. ఈలోపు ఇంకా ఎలాంటి వ్యూహాలతో వైసీపీ ముందుకెళ్తుందో వేచి చూడాలి మరి.
CM Jagan: తూ.గో. జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర నేడు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి