AP Politics: 10 ఏళ్లు గొర్రెలు అయ్యాం.. ఇక సింహాల్లా పోరాడాల్సిందే..
ABN , Publish Date - Mar 07 , 2024 | 02:08 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లు అవుతున్నా హోదా రాలేదన్నారు. పదేళ్ల నుంచి ఆంధ్రవారిని అధికార పార్టీలు గొర్రెలను చేశారని ధ్వజమెత్తారు. హోదా కోసం సింహాల మాదిరిగా ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. హోదా గురించి తలచుకొని షర్మిల కన్నీటి పర్యంతం అయ్యారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రకటించారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లు అవుతున్నా హోదా రాలేదన్నారు. పదేళ్ల నుంచి ఆంధ్రవారిని అధికార పార్టీలు గొర్రెలను చేశారని షర్మిల (YS Sharmila) ధ్వజమెత్తారు. హోదా కోసం సింహాల మాదిరిగా ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. హోదా గురించి తలచుకొని షర్మిల (YS Sharmila) కన్నీటి పర్యంతం అయ్యారు.
హోదా ఊసే లేదు
‘గత పదేళ్ల నుంచి హోదా ఊసే లేదు. హోదా అంటే ఏంటోనని వింతగా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఉద్యమించాలని నిర్ణయించుకుంది. ప్రత్యేక హోదా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడకుంటే హోదా రాదు. 10 ఏళ్లలో ఏ ఒక్కరూ పోరాటం చేయలేదు. ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు. ప్రజలు గొర్రెల లెక్క కాదు...సింహాల లెక్క బ్రతకాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పారు. గొర్రెలను బలి ఇస్తారు.. సింహాలను బలి ఇవ్వరు అన్నారు. హోదా విషయంలో 10 ఏళ్లు గొర్రెలు అయ్యాం. మొదటి 5 ఏళ్లు చంద్రబాబు గొర్రెలను చేశాడు. తర్వాత 5 ఏళ్లు జగన్ గొర్రెలను చేశాడు. ఇప్పుడు మనం గొర్రెలం కాదు సింహాలం. సింహాల మాదిరిగా పోరాటం చేయక పోతే హోదా రాదు. పోరాడితే పోయేది ఏమి లేదు..బానిస సంకెళ్లు తప్పా అని’ షర్మిల విరుచుకుపడ్డారు.
మోదీపై విమర్శలు
‘తాము ఇన్నాళ్లు మంచిగా ఉన్నది చాలు. అలా ఉంటే హోదా ఇచ్చారా ? మంచిగా ఉంటే పోలవరం కట్టారా? ఆంధ్రులను మోసం చేసిన ప్రధాని మోదీ ఒక డిఫాల్టర్. మోదీ ఒక కేడీ. హోదా వచ్చి ఉంటే మన రాష్ట్రం డెవలప్ అయ్యేది. హోదా వస్తే రూ.15 లక్షల కోట్లు వచ్చేవి. జగన్ ఆన్నకి అభివృద్ధి ధ్యాస లేదు. మాట ఇచ్చి మడత పెట్టిన ఘనత జగన్‌ది. జలయజ్ఞం కింద వైఎస్ఆర్ కట్టిన ప్రాజెక్ట్‌లకు దిక్కులేదు. వ్యక్తిగత రాజకీయాల కోసం ఏపీకి రాలేదు. రాజకీయాలు కావాలంటే 2019లో ఇక్కడ పార్టీ ఏర్పాటు చేసే వారం. హోదా సాధన, విభజన సమస్యల కోసం వచ్చా. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటతో వైఎస్ఆర్ బిడ్డ ఆంధ్రలో అడుగు పెట్టింది. హోదాపై మొదటి సంతకం పెడతా అని హామీ ఇచ్చారు అందుకే వచ్చా. హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి లేదు. హోదా రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు రావు. రాష్ట్రానికి భవిష్యత్ లేదు. ప్రత్యేక హోదా ఊపిరి అవుతుంది. ఊపిరి లేకుండా బ్రతక గలమా ? రాష్ట్రమంతా కాంగ్రెస్ శ్రేణులు ఉద్యమించాలి. హోదా సాధించే వరకు విశ్రమించేది లేదు అని’ షర్మిల స్పష్టం చేశారు.
ఏపీలో బీజేపీ రాజ్యం..?
’బీజేపీకి రాష్ట్రంలో ఒక్క ఎంపీ లేరు , ఒక్క ఎమ్మెల్యే లేరు. అయినా రాష్ట్రంలో బీజేపీ రాజ్యం ఎలుతుంది. జగన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే బీజేపీ ఉన్నట్లే. హోదా వచ్చి ఉంటే వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవి. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు దాటిన రాజధాని లేదు. హైదరాబాద్ 10 ఏళ్లు ఇస్తే అవసరం లేదని వచ్చారు. ఇక్కడ ఏం ఉద్ధరించారు. రాష్ట్రానికి సిగ్గు చేటు. ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. రాష్ట్రం మాత్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. ఆంధ్ర అభివృద్ధి నాది అని మోదీ హామీ ఇచ్చారు. ఏ ఒక్క హామీ సైతం నెరవేర్చలేదు అని’ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.