Share News

Minister Anitha: 980 మందితో జగన్‌కు భద్రత అవసరమా..?

ABN , Publish Date - Aug 06 , 2024 | 07:00 PM

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్లలో ప్రజలను పీడించకు తిన్నారని.. ప్రజా సమస్యలను గాలికొదిలేశారని హోం మంత్రి వంగలపూడి అనిత ( Anitha) విమర్శించారు.

Minister Anitha: 980 మందితో జగన్‌కు భద్రత అవసరమా..?
Home Minister Anitha

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్లలో ప్రజలను పీడించకుతిన్నారని.. ప్రజా సమస్యలను గాలికొదిలేశారని హోం మంత్రి వంగలపూడి అనిత ( Anitha) విమర్శించారు. మంగళవారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి అనిత వినతులు స్వీకరించారు. జగన్ హయాంలో జరిగిన భూదోపిడిపై వినతుల వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. జగన్ బాధితులు పులివెందుల నుంచి ప్రజాదర్బార్‌కు పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలిపారు.


జగన్ భద్రత తగ్గించలేదు..?

ఒక గ్రామ జనాభా అంత సెక్యూరిటీ జగన్ కావాలని అడుగుతున్నారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రికి 980 మందితో భద్రత అవసరమా..? అని ప్రశ్నించారు. జగన్‌కి ఇవ్వాల్సిన భద్రతను ఇస్తున్నామని స్పష్టం చేశారు. తాము ఎక్కడ జగన్ భద్రత తగ్గించలేదని తేల్చిచెప్పారు. ప్రతిపక్ష హోదా కావాలి... భద్రత కావాలని హైకోర్టులో జగన్ పిటిషన్ వేయడం రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శించారు. ప్రతిపక్ష హోదా కావాలంటే పది శాతం అసెంబ్లీలో సీట్లు ఉండాలనే విషయం జగన్‌కి తెలియదా అని ప్రశ్నించారు. అక్రమ కేసులు, వైసీపీ హయాంలో జరిగిన హత్యలపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. వైసీపీ పాలనలో అక్రమంగా సస్పెండ్ చేశారంటూ పలువురు పోలీసులు హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేశారు.

Updated Date - Aug 06 , 2024 | 07:03 PM