Anitha: యువతిని హత్య చేసింది ఎవరో కనిపెట్టండి
ABN , Publish Date - Jun 21 , 2024 | 06:36 PM
చీరాల మండలం ఈపురుపాలెంలో బహిర్భూమికి వెళ్లిన యువతి దారుణ హత్యకు గురైందని హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) తెలిపారు. యువతిపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
బాపట్ల: చీరాల మండలం ఈపురుపాలెంలో బహిర్భూమికి వెళ్లిన యువతి దారుణ హత్యకు గురైందని హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) తెలిపారు. యువతిపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ తల్లిదండ్రులు కూడా చూడలేని అచేతన స్థితిలో యువతి ఉందన్నారు. ఇలాంటి సంఘటన చూస్తుంటే సభ్యసమాజంలో ఉన్నామా.. లేదా అని భయం వేస్తుందని చెప్పారు. గంజాయి , డ్రగ్స్ మత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు.
గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయన్నారు. యువతిపై అత్యాచారం, హత్య ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్గా స్పందించారని చెప్పారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశించారని అన్నారు. ప్రభుత్వం నుంచి యువతి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. యువతి కుటుంబానికి రూ. 10 లక్షలు పరిహారాన్ని చంద్రబాబు ప్రకటించారని చెప్పారు.గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.