Share News

Minister Anitha: మహిళల అత్యాచారాలపై అసెంబ్లీలో వాడివేడి చర్చ.. వైసీపీ ఎమ్మెల్సీలకు అనిత మాస్ వార్నింగ్

ABN , Publish Date - Nov 18 , 2024 | 10:59 AM

వైసీపీ ఎమ్మెల్సీలకు హోంమంత్రి వంగలపూడి అనిత శాసన మండలిలో మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ సభ్యులకు ధీటుగా సభలో అనిత సమాధానమిచ్చారు. అయితే మంత్రి అనిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు

Minister Anitha: మహిళల అత్యాచారాలపై అసెంబ్లీలో వాడివేడి చర్చ.. వైసీపీ ఎమ్మెల్సీలకు అనిత మాస్ వార్నింగ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly budget meetings) సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం(Question time continues) కొనసాగుతోంది. అయితే శాసన మండలిలో మహిళల అత్యాచారాలపై వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఏపీలో జగన్ ప్రభుత్వం కంటే ఈ ఐదు నెలల్ కూటమి ప్రభుత్వంలో క్రైమ్ రేటు చాలా తగ్గిందని మంత్రి అనిత స్పష్టం చేశారు.


మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. దిశ చట్టం తీసుకొస్తారా, దిశ యాప్ కొనసాగిస్తారా లేదా అని వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ప్రశ్నించారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి అనిత సమాధానం ఇస్తూ వైసీపీ ప్రభుత్వ పాలనలో చాలా లోపాలున్నాయని మంత్రి అనిత తెలిపారు. దిశ చట్టం లేదు. నిర్భయ చట్టం ఉంది. నిర్భయ కింద వైసీపీ ప్రభుత్వంలో కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చిన అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ ఎందుకు నిర్మించలేదని వైసీపీ సభ్యులు నిలదీశారు. గంజాయి వినియోగం పెరగడంతో రాష్ట్రంలో నేరాలు పెరిగాయని మంత్రి అనిత వివరించారు.


అయితే హోం మంత్రి అనిత వ్యాఖ్యలను వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటూ వైసీపీ నినాదాలు చేసింది. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కారణంతోనే నీలాంటి వారు సభకు వస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను ఉద్దేశించి మంత్రి అనిత అన్నారు. తన సమాధానం వినటానికి దమ్ము, ధైర్యం కావాలని మంత్రి అనిత అన్నారు. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. తర్వాత ప్రశ్నకు వైసీపీ సభ్యులు సభలోకి వచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ రైల్వే డీఆర్ఎం అరెస్టును ధ్రువీకరించిన సీబీఐ

ముషాయిర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..

బాబు అరెస్టుకు.. నా స్టేట్‌మెంట్లతో లింకా..

గనుల ఘనుడు వెంకటరెడ్డి విడుదల

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 18 , 2024 | 11:09 AM