Share News

Kandula Durgesh: కూచిపూడి నృత్యం అజరామరంగా విరాజిల్లేలా చేస్తాం

ABN , Publish Date - Dec 29 , 2024 | 08:10 PM

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన ఏపీలో ఆదరణ లేకపోవడం బాధాకరమని మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మనది అని చెప్పుకొని సాంస్కృతిక, సాంప్రదాయ కళలు అంతరించిపోకుండా చూసుకునే బాధ్యత అందరిపై ఉందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

Kandula Durgesh: కూచిపూడి నృత్యం అజరామరంగా విరాజిల్లేలా చేస్తాం
Minister Kandula Durgesh

కృష్ణాజిల్లా (పామర్రు): కూచిపూడి నృత్యం అజరామరంగా విరాజిల్లే విధంగా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మువ్వ మండలం కూచిపూడి కళాక్షేత్రంలో కూచిపూడి పతాక స్వర్ణోత్సవ ముగింపు వేడుకలు ఇవాళ(ఆదివారం) జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, కూచిపూడి నృత్య గురువులు, కళాకారులు పాల్గొన్నారు. కూచిపూడి కళాక్షేత్రాన్ని మంత్రి దుర్గేష్, రఘురామకృష్ణంరాజు సందర్శించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. 50 అడుగుల ఏకశిలపై కూచిపూడి నృత్య భంగిమలతో పతాకాన్ని ప్రపంచానికి సమర్పించడం అద్భుతమని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన ఏపీలో ఆదరణ లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మనది అని చెప్పుకొని సాంస్కృతిక, సాంప్రదాయ కళలు అంతరించిపోకుండా చూసుకునే బాధ్యత అందరిపై ఉందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.


కూచిపూడి నృత్యాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తా: మంత్రి కొల్లు రవీంద్ర

kollu-ravindra.jpg

కూచిపూడి నృత్యాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే బాధ్యత జిల్లా వాసిగా తాను తీసుకుంటానని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు కళల గురించి ఎప్పుడు మాట్లాడిన నోటి వెంట ముందుగా వచ్చేది కూచిపూడి గురించే అని గుర్తుచేశారు. కూచిపూడి నృత్య కళాకారులను ప్రోత్సహించేలా... ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి అవకాశం కల్పించేలా కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖల సమన్వయంతో, స్థలాలు కేటాయించి కూచిపూడి క్షేత్రాల ఏర్పాటుతో భావితరాలకు కూచిపూడి నృత్యాన్ని చేరువ చేసేందుకు కృషి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.


కూచిపూడి నృత్యం దశదిశలా విరాజిల్లుతుంది: రఘురామకృష్ణంరాజు

raghu.jpg

ఆంధ్ర సాంప్రదాయ నృత్య కళ కూచిపూడిని అత్యున్నత స్థాయికు తీసుకెళ్లడంలో ఎందరో మహానుభావులు తమ జీవితాలను అంకితం చేశారని ఏపీ డిప్యూటీ స్పీకర్‌, ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాల క్రితం సిద్ధేంద్ర యోగి క్షేత్రం మీదుగా ఆవిర్భవించిన కూచిపూడి నృత్యం నేడు ప్రపంచవ్యాప్తంగా దశదిశలా విరాజిల్లుతుందని తెలిపారు. భాషకు, సంస్కృతికి ప్రాధాన్యత ఇచ్చే ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని చెప్పారు. దురదృష్టవశాత్తు మన భాషను, సంస్కృతిని, సాంప్రదాయాన్ని అంతం చేసే ప్రభుత్వమే ఐదేళ్లుగా ఉందని నాలాంటి వాళ్లు ఎంతో బాధపడే వాళ్లమని.. కానీ నేడు వాటిని కాపాడే ప్రభుత్వం రావడం ఎంతో సంతోషకరంగా ఉందని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Amaravati: జగన్ నిర్వాకంతో నీటిలోనే నానుతున్న ర్యాప్ట్ ఫౌండేషన్

Deputy CM Pawan Kalyan : తోలుతీసి కూర్చోబెడతాం

JC Prabhakar Reddy: వీపు విమానంమోతమోగిస్తా.. మాజీ మంత్రికి జేసీ వార్నింగ్

Read Latest AP News and Telugu News

Updated Date - Dec 29 , 2024 | 08:12 PM