Janasena: జగన్ ప్రభుత్వంలో నిర్మాణ రంగం కుదేలు: బండి రామకృష్ణ
ABN , Publish Date - Jul 09 , 2024 | 10:34 PM
గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు పేద ప్రజలకు ఇసుక లేకుండా చేశారని ఫలితంగా నిర్మాణ రంగం కుదేలైందని జనసేన నాయకులు బండి రామకృష్ణ (Bandi Ramakrishna) విమర్శించారు. ఉచిత ఇసుక అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మచిలీపట్నం బస్టాండ్ సెంటర్లో ఈరోజు(మంగళవారం) సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కొల్లు రవీంద్ర చిత్ర పటాలకు ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.
కృష్ణా : గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు పేద ప్రజలకు ఇసుక లేకుండా చేశారని ఫలితంగా నిర్మాణ రంగం కుదేలైందని జనసేన నాయకులు బండి రామకృష్ణ (Bandi Ramakrishna) విమర్శించారు. ఉచిత ఇసుక అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మచిలీపట్నం బస్టాండ్ సెంటర్లో ఈరోజు(మంగళవారం) సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కొల్లు రవీంద్ర చిత్ర పటాలకు ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా బండి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ... ఇసుక కొరతపై నాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఉద్యమించారని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఉచిత ఇసుక విధానాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయడం హర్షణీయమని బండి రామకృష్ణ తెలిపారు.
ఇసుకతో వైసీపీ నేతలు కోట్లు గడించారు: గోపీచంద్
గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఇసుక అమ్ముకుని కోట్లు గడించారని టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ తెలిపారు. పేద ప్రజలకు ఇసుక అందకుండా చేశారని మండిపడ్డారు. ఏజెన్సీ సంస్థలను పెట్టుకుని జగన్ సర్కార్ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిందని విమర్శించారు. నాడు ఇసుక కొరతపై కొల్లు రవీంద్ర చేసిన పోరాట ఫలితంగానే ఆయనకు చంద్రబాబు మైన్స్ శాఖను అప్పగించారని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పేద ప్రజలందరికీ ఉచిత ఇసుక విధానం అమలుకు కొల్లు రవీంద్ర కృషి చేస్తున్నారని గొర్రెపాటి గోపీచంద్ పేర్కొన్నారు.