AP News: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆగని జగన్ ప్రభుత్వ అరాచకాలు
ABN , Publish Date - Mar 06 , 2024 | 03:38 PM
Andhrapradesh: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జగన్ ప్రభుత్వ అరాచకాలకు అంతే లేకుండాపోతోంది. జిల్లాలో వైసీపీ మొత్తానికి మొత్తంగా ఖాళీ అవుతున్న నేపథ్యంలో కక్షపూరిత చర్యలు దిగుతోంది. కొత్తకోడూరులో 306 మంది పేదలకిచ్చిన స్థలాల లేఅవుట్ తొలగిస్తూ దుశ్చర్యలకు పాల్పడింది.
నెల్లూరు, మార్చి 6: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జగన్ ప్రభుత్వ (Jagan Government) అరాచకాలకు అంతే లేకుండాపోతోంది. జిల్లాలో వైసీపీ (YSRCP) మొత్తానికి మొత్తంగా ఖాళీ అవుతున్న నేపథ్యంలో కక్షపూరిత చర్యలు దిగుతోంది. కొత్తకోడూరులో 306 మంది పేదలకిచ్చిన స్థలాల లేఅవుట్ తొలగిస్తూ దుశ్చర్యలకు పాల్పడింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) చొరవతో గతంలో జగన్ ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. ఇటీవల చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) సమక్షంలో వైసీపీ ముఖ్య నేత కోడూరు కమలాకర్ రెడ్డి టీడీపీలో చేరారు. ఈ క్రమంలో కమలాకర్ రెడ్డి వర్గీయులనే నెపంతో లే అవుట్ తొలగించేశారు. భారీగా పోలీసులని మోహరించి, యంత్రాలతో రోడ్లుని చదున చేయడంతో పాటు హద్దు రాళ్లు తొలగించారు. ఇదేమిటని ప్రశ్నించిన లబ్దిదారులను వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు. వైసీపీ ఆరాచకాలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
Big Breaking: దళిత మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఘోరంగా అవమానించిన సీఎం జగన్
CM Jagan: వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేయడం సంతోషంగా ఉంది
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...