AP Politics: టియర్ గ్యాస్ ఎఫెక్ట్.. జేసీకి అస్వస్థత
ABN , Publish Date - May 15 , 2024 | 01:06 PM
Andhrapradesh: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. తాడిపత్రిలో టియర్ గ్యాస్ ఎఫెక్ట్ వల్లే జేసీ అనారోగ్యానికి గురయ్యారు. ఆందోళన కారులను చెదరగొట్టడంలో భాగంగా నిన్న కాంచన ఆసుపత్రి సమీపంలో పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే జేసీ ప్రభాకరరెడ్డి సమీపంలో టియర్ గ్యాస్ పడింది.
అనంతపురం, మే 15: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (TDP Leader JC Prabhakar Reddy) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు (Hyderabad) తరలించారు. తాడిపత్రిలో టియర్ గ్యాస్ ఎఫెక్ట్ వల్లే జేసీ అనారోగ్యానికి గురయ్యారు. ఆందోళన కారులను చెదరగొట్టడంలో భాగంగా నిన్న కాంచన ఆసుపత్రి సమీపంలో పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి సమీపంలో టియర్ గ్యాస్ పడింది. దీంతో టియర్ గ్యాస్ ఎఫెక్ట్‌తో జేసీ లంగ్స్ ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి చికిత్స పొందుతున్నారు.
AP News: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం.. వేట కొడవళ్లతో విచక్షణారహితంగా..
అసలేం జరిగిందంటే..
ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం రాళ్ల దాడికి దిగారు. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ రాళ్ల దాడి చేయడాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటివైపు వేలాది మంది టీడీపీ కార్యకర్తలతో బయలుదేరిన జేసీని పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ జేసీ ముందుకు సాగడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇవి కూడా చదవండి...
AP Elections: అంతలోనే మాట మారింది..?
AP Elections: నుదిటిపై గాయం.. రక్తమోడుతోన్నా బెదరని ఏజెంట్
Read Latest AP News And Telugu News